Telugu Gateway
Andhra Pradesh

విజయసాయిరెడ్డి పాదయాత్ర

విజయసాయిరెడ్డి పాదయాత్ర
X

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి శనివారం నాడు విశాఖపట్నంలో పాదయాత్ర ప్రారంభించారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకంగా ఆయన ఈ పాదయాత్ర తలపెట్టారు. జీవీఎంసీ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వద్ద నిర్వహించే బహిరంగ సభతో ముగించనున్నారు. పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉక్కు ఉద్యమ పరిరక్షణ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.

''స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ.. ప్రైవేటీకరణ జరగకుండా పరిశ్రమను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించడంతో పాటు రుణాలను ఈక్విటీ రూపంలో మార్చాలని సీఎం కేంద్రానికి ప్రతిపాదించారని'' ఆయన పేర్కొన్నారు. ఒడిశాలో పెద్ద ఎత్తున ఉన్న ఇనుప ఖనిజానికి సంబంధించిన మైన్స్‌ తో లీజు ఒప్పందాల్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతున్నామన్నారు. ఈ పాదయాత్రలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

Next Story
Share it