అందరూ చూసే యాడ్స్ లో వైఎస్ఆర్ ఫోటో మాయం!

ఇది ప్రజలకు తప్పుడు సంకేతం పంపుతుందని..సీఎం జగన్ స్వయంగా తన తండ్రి ఫోటోలు లేని యాడ్స్ ఇవ్వటం..అది కూడా ఆయన పేరుతో ఉన్న వాటికి దివంగత నేత ఫోటో పెట్టకపోవటం అన్నది సరికాదనే చర్చ సాగుతోంది. మరో వైపు నవరత్నాల లోగోలో కూడా తొలుత వైఎస్ఆర్, జగన్ ఫోటోలు ఉండేవి. ఇప్పుడు వైఎస్ఆర్ ఫోటో తీసేసి కేవలం ఒక్క సీఎం జగన్ ఫోటో మాత్రమే వేస్తున్నారు. స్వయంగా సీఎం జగన్ ఫ్యామిలీకి చెందిన పత్రికలోనూ కేవలం ఒక్క జగన్ తో కూడిన నవరత్నాల స్కీమ్ ఫోటోను మాత్రమే తాజాగా ప్రచురించారు కూడా. ఇవన్నీ చూస్తుంటే సీఎం జగన్ కూడా వైఎస్ఆర్ పేరు బదులు తన పథకాలు..తన ఇమేజ్ పెంచుకునే పనిలో ఉన్నట్లు కన్పిస్తోందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే ఆయన పేరుతో ఉన్న స్కీమ్ లకు కూడా ఆయన ఫోటో పెట్టకుండా చేయటం అంటే ఇది కీలక పరిణామంగా అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ మామ. కానీ సీఎం జగన్ దగ్గరకు వచ్చేసరికి వైఎస్ఆర్ స్వయంగా తండ్రి. మరి ఓ వైపు వెబ్ సైట్ లో మాత్రం వైఎస్ఆర్ ఫోటోలు పెట్టి..జాకెట్ యాడ్స్ లో మాత్రం ఆయన ఫోటోలు తీసేయటం దేనికి సంకేతం అన్న చర్చ సాగుతోంది.