Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం

ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం
X

తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీసీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం నడుస్తోందని..ఇది రాష్ట్రానికి ఎన్నడూలేని రీతిలో చెడ్డపేరు తెస్తుందని విమర్శించారు. రాష్ట్రాన్ని నేరగాళ్ళకు స్వర్గంగా మార్చారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 'ఏపిలో అప్పులు అత్యధికం, అభివృద్ది అత్యల్పం. అప్పుల భారం ప్రజలకు...పప్పు బెల్లాలు వైసిపి నాయకులకు. ఫిజికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది శూన్యం. ఉద్యోగులకు టిఏ, డిఏలు లేవు, ఆరు డిఏలు బకాయిలు పెట్టారు. చివరికి రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో పించన్లు లేవు. ఫిస్కల్ డెఫిసిట్ రూ 1,10,320 కోట్లకు చేరుతోంది.

19 నెలల్లో రూ. లక్షన్నర కోట్లు అప్పులు చేశారు. ప్రజలపై రూ.75వేల కోట్ల పన్నులు వేశారు. నెలకు రూ4వేల కోట్ల పన్నుల భారం మోపారు.ఈ ఏడాది తొలి 6నెలల్లో రెవిన్యూ వసూళ్లు 6% పెరిగాయి. అప్పులు గతం కన్నా రెట్టింపు చేశారు. ఖర్చులు 23% అదనంగా చేశారు. కేంద్రసాయం రూ7,700కోట్లు అదనంగా అందింది.ఈ డబ్బంతా ఏమైంది..? ఎక్కడికి పోయింది ఈ డబ్బంతా..?ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు చేసింది శూన్యం. మార్కెట్ లో నిత్యావసరాల ధరలకు, చేసే సంక్షేమానికి పొంతనే లేదు. జగన్ అవినీతి, చేతగాని పాలనతో ఎన్నడూ లేని కష్టాల్లో ప్రజలు.అగమ్యగోచరంగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిని దిగజార్చారు.ఆర్ధిక నిర్వహణ చేతగాకే ఈ దుస్థితి తెచ్చారు. 19నెలల్లో రూ20వేలు తలసరి అప్పు భారం మోపారు.తప్పుడు నిర్ణయాల్లో, ఎడాపెడా పన్నుల్లో తుగ్లక్ 2.0గా జగన్ రెడ్డి.' నిలిచారని తీవ్ర విమర్శలు గుప్పించారు.

Next Story
Share it