Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ కి సిబిఐ వరస షాక్ లు !

వైసీపీ కి సిబిఐ వరస షాక్ లు !
X

ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వివేకా హత్యకు సంబంధించి విచారణ సంస్థ సిబిఐ ఇస్తున్న వరస షాక్ లతో ఆ పార్టీ నేతలు అవాక్కు అవుతున్నారు. తాజాగా వై ఎస్ వివేకా హత్య విషయం ప్రపంచానికి తెలియటానికి ముందే ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి తెలుసు అని కోర్టు కు సమర్పించిన పిటిషన్ లో వెల్లడించింది. . ఈ సంగతి తేల్చాల్సి ఉంది అని పేర్కొంది.. ఈ పరిణామంతో ఒక్కసారిగా వైసీపీ ఉలిక్కిపడినట్లు అయింది. ఎందుకంటే ఈ కేసు లో ఇప్పటివరకు సీఎం జగన్ పేరును సిబిఐ ప్రస్తావించటం ఇదే మొదటిసారి కావటం తో ఆ పార్టీ ఇరకాటంలో పడినట్లు అయింది. అందుకే వెంటనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి రంగంలోకి దిగి ఇది సిబిఐ పిల్ల చేష్ట అంటూ తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో ఇందులో పెద్ద కుట్ర ఉంది అని మండిపడ్డారు. అసలు దీనిపైనే దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించారు. దర్యాప్తులో చూడాల్సిన కోణాలు ఎన్నో ఉంటే వాటిని పట్టించుకోకుండా సిబిఐ సెన్సేషన్ కోసం ఇవన్నీ చేస్తుంది అని ఆరోపించారు. సజ్జల రామకృష్ణ రెడ్డి మాత్రం చాలా కన్వీనెంట్ గా ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు ఈ హత్య వెనక ఉన్నారు అని ఆరోపించి.. ఇప్పుడు మాత్రం ఆస్తి వివాదాలు...అక్రమ సంబంధాలు..వ్యాపార లావాదేవీలు అంటూ కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారు. ఈ విషయాలను మాత్రం అయన మర్చిపోయారు. సిబిఐ తాజాగా తన పిటిషన్ లో సీఎం జగన్ కు ముందే తెలుసు అని ప్రస్తావించటం ఒకెత్తు అయితే...శనివారం నాడు ఈ హత్యకు సంబంధించి రహస్య సాక్షి ఉన్నారు అని ప్రకటించటం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ దశలో తాము ఆ పేరు వెల్లడించలేము అని..కోర్టు కు అయితే సీల్డ్ కవర్ లో వివరాలు ఇస్తామని సిబిఐ తెలిపింది. వివేకా హత్యకు నిధులు సమకూర్చింది అవినాష్ రెడ్డి అని కోర్టు కు సిబిఐ నివేదించింది. ఈ పరిణామాలు అన్ని ఎటు వెళ్లి ఎటు వస్తాయో అన్న టెన్షన్ వైసీపీ నేతల్లో ఉంది. ఇప్పటికే ప్రజల్లో పలు అంశాలపై వ్యతిరేకత ఉంది అని...వాటికి తోడు వై ఎస్ వివేకా హత్య కేసు లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ కి దారుణంగా నష్టం చేస్తాయని ఒక నేత అభిప్రాయపడ్డారు. సిబిఐ కూడా ఈ హత్య కేసు విచారణ సందర్భంగా అటు కోర్టు లోనూ ..ఇటు బయట కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటోంది. గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో మోడీ సర్కారు అత్యంత శక్తివంతంగా ఉంది...దేశంలోని విపక్షాలు అన్నిటిని విచారణ సంస్థలతో వేధిస్తున్నారు అని పార్టీ లు అన్నీ ఆరోపిస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ ఇంకా మోడీ ఆధీనంలోని సిబిఐ ఓడిపోయి ఉన్న చంద్రబాబు, టీడీపీ నేతలు చెప్పినట్లు ఆడుతుంది అని విమర్శలు చేయటమే ఇందులో వెరైటీ అని చెప్పొచ్చు.

Next Story
Share it