Telugu Gateway
Andhra Pradesh

వైఎస్ఆర్ చెప్పినట్లు అన్ని ఆస్తులు సమానంగా పంచాలి

వైఎస్ఆర్ చెప్పినట్లు అన్ని ఆస్తులు సమానంగా  పంచాలి
X

వైఎస్ ఫ్యామిలీలో విబేధాలు మరింత ముదిరాయి. గత కొంత కాలంగా సాగిన లేఖల యుద్ధం ఇప్పుడు బయట పడింది. తాజాగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్ సిఎల్ టి లో వేసిన పిటిషన్ బయటకు రాగా...ఆంధ్ర ప్రదేశ్ లో అధికార తెలుగు దేశం పార్టీ బుధవారం సాయంత్రం జగన్ మోహన్ రెడ్డి కి ఆయన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ రాసిన లేఖన తన అధికారిగా పేస్ బుక్ పేజీ లో షేర్ చేసింది. దీంతో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు షర్మిల తో పాటు విజయమ్మ కూడా దివంగత రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లు ఉమ్మడి ఆస్తులు పంచాలని కోరుతుంటే...జగన్ అందుకు నో చెపుతున్నట్లు అర్ధం అవుతోంది. సెప్టెంబర్ 12 న జగన్ కు వీళ్ళు రాసిన లేఖ ఇప్పుడు టీడీపీ బయటపెట్టింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.

"మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని నిర్ద్వంద్వంగా ఆదేశించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆ షరతుకి అంగీకరిస్తున్నాని ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకి నేను ఒప్పుకోను అంటూ నిరాకరించారు . భారతి సిమెంట్స్‌, సాక్షి ఇలా తన జీవితకాలంలో రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లు సమానంగా పంచుకోవాలని ఆనాడే నిర్ద్వంద్వంగా చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా." అంటూ పేర్కొన్నారు. మరి ఈ లేఖలోని అంశాలపై జగన్ రాబోయే రోజుల్లో ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story
Share it