అవినాష్ రెడ్డి, వైస్ షర్మిల ఫైట్ తప్పదా?!
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఈ సారి మరింత ఆసక్తి రేపేలా ఉన్నాయి. గత ఎన్నికల్లో అన్న జగన్ కోసం రాష్ట్రమంతా పర్యటించిన వై ఎస్ షర్మిల ఈ సారి ఆయనకు వ్యతిరేకంగా మారారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షర్మిల కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు. దీంతో అందరి కళ్ళు ఈ సీటు పై పడబోతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ మరో సారి అవినాష్ రెడ్డి కే సీటు కేటాయించిన విషయం తెలిసిందే. షర్మిల రంగంలోకి దిగితే పోటీ మాత్రం ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.