Telugu Gateway
Andhra Pradesh

పెళ్లి పిలుపులకే..అయినా..!

పెళ్లి పిలుపులకే..అయినా..!
X

వ్యక్తిగతమే అయినా కొన్ని భేటీలు అందరిలో ఆసక్తి రేపుతాయి. అలాంటిదే హైదరాబాద్ లో ఒకటి జరిగింది. ఇటీవలే తెలంగాణ వైఎస్ఆర్ టిపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల శనివారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో సమావేశం అయ్యారు. తన కొడుకు రాజా రెడ్డి పెళ్ళికి పిలవటానికే ఆమె చంద్రబాబు ను కలిశారు. తర్వాత మీడియా తో మాట్లాడుతూ మా కుటుంబంలో పెళ్లిళ్లకు వైస్సార్ కూడా చంద్రబాబు ని పిలిచారు అని..అలాగే తాను కూడా పెళ్ళికి పిలవటానికే వచ్చినట్లు వెల్లడించారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు అని తెలిపారు.

రాజకీయాల్లో వ్యక్తిగత కక్ష్యలు ఉండకూడదు...స్నేహపూర్వక వాతావరణం ఉండాలి అంటూ షర్మిల వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలోని జగన్ సర్కారు కొద్దినెలల క్రితం వరసగా కేసు లు పెట్టిన విషయం తెలిసిందే. వీటిని దృష్టిలో పెట్టుకునే షర్మిళ ఈ వ్యాఖ్యలు చేశారు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. షర్మిళ కాంగ్రెస్ లో చేరటం వెనక చంద్రబాబు కుట్ర ఉంది అంటూ ఆయన విమర్శలు చేశారు.

Next Story
Share it