Telugu Gateway
Andhra Pradesh

ఆ మాటల అర్ధం అదేనా!

ఆ మాటల అర్ధం అదేనా!
X

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సోదరి షర్మిల టెన్షన్ బాగానే పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఆమె కాంగ్రెస్ లో చేరటం వల్ల అధికార వైసీపీ కి భారీ ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉంది అనే అంచనాల మధ్య జగన్ బుధవారం నాడు కాకినాడలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి..కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి..కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అంటూ కామెంట్ చేశారు. షర్మిలకు రాజ్యసభ పదవి ఇవ్వటంతో పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వటానికి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవటం జగన్ కు ఏ మాత్రం మింగుడుపడని పరిణామం అనే చెప్పొచ్చు. అందుకే అయన కుటుంబాలను చీల్చటానికి కూడా వెనకాడరు అంటూ కామెంట్ చేశారు అనే చర్చ సాగుతోంది. షర్మిలకు మొదటి నుంచి పొలిటికల్ ఇంటరెస్ట్ లు ఉన్నాయనే విషయం పార్టీలో అందరికి తెలుసు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ఆమె ఆంధ్ర ప్రదేశ్ లో తిరిగి ప్రచారం కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.

కానీ గెలిచినా తర్వాత షర్మిలకు జగన్ రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోగా...పూర్తిగా పక్కన పెట్టారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టడం కూడా జగన్ కు ఇష్టం లేదు అని గతంలో సజ్జల రామకృష్ణా రెడ్డి బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా సరే ఆమె తెలంగాణాలో ముందుకే వెళ్లారు..ఇప్పుడు వైస్సార్ తెలంగాణ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి నిర్ణయించుకున్నారు. తెలంగాణాలో పార్టీ పెట్టడం కంటే...షర్మిల తీసుకున్న తాజా నిర్ణయం జగన్ కు పెద్ద షాక్ గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ లో చేరి ఆమె నేరుగా రాజకీయంగా అన్నతోనే తలపడాల్సిన పరిస్థితి. ఇంకో కీలక విషయం ఏమిటి అంటే...టీడీపీ, జనసేన పొత్తువల్ల వైసీపీ గడ్డుపరిస్థితి ఎదుర్కొంటోంది. వీటికి తోడు ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ ద్వారా ఏపీలోకి ఎంట్రీ ఇవ్వటం వైసీపీ ని మరింత ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉంది. ఏ రకంగా చూసుకున్నా వైసీపీలో ఇప్పుడు వాతావరణం ఏ మాత్రం ఆశాజకంగా లేదు అనే చర్చ సాగుతోంది.


Next Story
Share it