ఏపీ రాజకీయం లెక్కలు మారాయి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా కూడా తర్వాత ఇదే బాటలో పయనించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే విషయం తేలిపోవటంతో ఈ మూడు పార్టీ లు ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ ని మరింత టార్గెట్ చేయటం ఖాయం. వైసీపీ కి అటు టీడీపీ, జన సేన ను టార్గెట్ చేయటం పెద్ద ఇబ్బంది కాదు..కానీ బీజేపీ విషయంలో జగన్..వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. వాస్తవానికి టీడీపీ తో ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు తో బీజేపీ కీలక నాయకులు అయిన ప్రధాని మోడీ, అమిత్ షా లకు సదభిప్రాయం లేదు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అయినా సరే ఇప్పుడు టీడీపీ, జన సేన కూటమిలో బీజేపీ చేరటానికి నిర్ణయించుకుంది. అంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ కూడా తెర మీదకు రావటం ఖాయం. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా బీజేపీ కే మద్దతు ఇస్తాయని ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. అయినా సరే కొన్ని సీట్ల కోసం టీడీపీ తో పొత్తుకుబీజేపీ సిద్ధం అయింది అంటే దీని వెనక ఎవరి లెక్కలు వాళ్లకు ఉండి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.