దిగ్గజ పార్టీలను మట్టికరిపించిన టీవీకే

ఇద్దరూ హీరోలే. పైగా పక్క పక్క రాష్ట్రాల వాళ్ళు. ఇద్దరికీ యువతలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ రాజకీయంలో మాత్రం ఎంత తేడానో. వాళ్ళు ఎవరో ఇప్పటికే అందరికి అర్ధం అయి ఉంటుంది. ఒకరు జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే..మరొకరు తమిళగ వెట్రి కజగం (టీవీకె) అధినేత విజయ్. విజయ్ కూడా తమిళనాడులో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉన్న హీరో అన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 2019 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసినప్పుడు ఆయన కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి చవిచూశారు. 140 సీట్లలో జనసేన పోటీ చేస్తే ఒక్కటంటే ఒక్క చోట రాజోలులో జనసేన విజయం సాధించింది. కానీ తమిళ హీరో విజయ్ మాత్రం పార్టీ పెట్టిన కొద్దిరోజుల్లోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో విజయం సాధించి తమిళనాడు రాజకీయాల్లో పెద్ద సంచలనానికి కారణం అయ్యారు.
పార్టీ ప్రకటించిన తర్వాత విజయ్ పై వచ్చిన రాజకియ ఒత్తిళ్లు అన్ని ఇన్నీ కావు. ఎన్నికల ముందు పొత్తు కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విజయ్ పై ఎన్నో రకాల ఒత్తిళ్లు తెచ్చినట్లు ప్రచారం జరిగింది. రకరకాల ఒత్తిళ్లు ఎదురైనా కూడా విజయ్ పొత్తుల విషయంలో ఏ మాత్రం రాజీపడలేదు. ఒంటరిగానే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి ఇప్పుడు సంచలన ఫలితాలు సాధించాడు. ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు రాజకీయాల్లో ఎంతో పట్టున్న అధికార డీఎంకే తో పాటు ఏఐ డీఎంకే వంటి పార్టీలను కూడా చావు దెబ్బ కొట్టి విజయ్ టీవీకే పార్టీ విజయకేతనం ఎగురవేయడం పెద్ద సంచలనంగా మారింది. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ, బీజేపీతో కలిసి 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లు గెలుచుకుని వంద శాతం స్ట్రైక్ రేట్ దక్కించుకున్న పార్టీగా రికార్డు నమోదు చేసుకుంది. అయితే సోమవారం నాడు వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఫలితాల తర్వాత మాత్రం విజయ్, పవన్ కళ్యాణ్ ల రాజకీయం మధ్య తేడాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
సోషల్ మీడియా లో కూడా ఇది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తమిళ నాడు ఎన్నికల ఫలితాలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పై తీవ్ర ప్రభావం చూపించటం ఖాయం అనే చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే ఒక స్వత్రంత పార్టీ గా ఉన్న జనసేన రాబోయే 15 సంవత్సరాలు కూడా టీడీపీ, బీజేపీ లతో కలిసి ముందుకు సాగుతామని ప్రకటిస్తూ పోతున్న విషయం తెలిసిందే. వేదిక ఏదైనా పవన్ కళ్యాణ్ పదే పదే ఇదే విషయం చెపుతుండటం జనసేన నేతలకు, క్యాడర్ కు ఏ మాత్రం నచ్చటం లేదు. రాజకీయంగా పోలిస్తే పవన్ కళ్యాణ్ కంటే విజయ్ ఎంతో జూనియర్ కిందే లెక్క. పైగా పవన్ కళ్యాణ్ కు నేరుగా లేకపోయినా పరోక్షంగా చిరంజీవి అభిమానుల అండ కూడా ఉంది. అయినా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఒంటరిగా అంతగా ప్రభావం చూపించలేకపోయారు. అందుకే ఇప్పుడు విజయ్, పవన్ కళ్యాణ్ ల మధ్య పోలికలతో హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. టీవీకే అధినేత విజయ్ వయస్సు కేవలం



