Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు తీరుపై పార్టీ నేతల్లో అసహనం

చంద్రబాబు తీరుపై పార్టీ నేతల్లో అసహనం
X

బాబాయ్ (వివేకానంద రెడ్డి )హత్య...కోడి కత్తి కేసు. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసే చర్యలు..నిర్ణయాలపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు కలగటానికి కారణం అయ్యాయి. పైన చెప్పిన రెండు కేసుల్లో జగన్ ప్రతిపక్షంలో ఉండగా చేసిన పెర్ఫార్మన్స్ కు...అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరించిన తీరుకు ఏ మాత్రం పొంతన లేకుండా పోయింది. దీంతో మొత్తానికి వివేకా మర్డర్..కోడి కత్తి కేసు ల విషయంలో జగన్ తీరు తేడా గా నే ఉంది అనే విషయాన్నీ అందరూ గమనించారు. పైగా ఇదే విషయంలో స్వయంగా జగన్ చెల్లెళ్ళు షర్మిల. సునీత లు బహిరంగంగానే జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో జగన్ ఓటమిలో ఇవి కూడా కీలక పాత్ర పోషించాయి. ఇవి అన్నీ అందరికి తెలిసిన విషయాలే. ఇప్పుడు ఏపీ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇందులో ప్రధాన భాగస్వామి తెలుగు దేశం పార్టీ అయితే...జనసేన, బీజేపీ లు కూడా ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి. విచిత్రం ఏమిటి అంటే టీడీపీ గత కొన్ని రోజులుగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మొత్తం విషయం నాన్నా..పులి కథలాగా మారిపోతుంది. ఇదే తీరు కంటిన్యూ అయితే గతంలో జగన్ కు ఎదురైన పరిస్థితే కూటమికి కూడా ఎదురుకావొచ్చు. గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.

ఈ విషయంలో కూడా అధికార, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఐదేళ్ల కాలంలో జగన్ పంచుడు పధకాలు తప్ప...ఇతర విషయాలు ఏమి పట్టించుకోలేదు అనే విషయం తెలిసిందే. జగన్ పాలనలో అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్వహణ చేయకపోతే ప్రమాదం అని..అప్పటి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రభుత్వానికి నివేధించినా అప్పటి వైసీపీ ప్రభుత్వం దీన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. తర్వాత వచ్చిన భారీ వరదలకు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరిగింది. ఇందులో అప్పటి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఉన్నట్లు కేంద్ర మంత్రి కూడా పార్ల మెంట్ వేదికగా ప్రకటించారు. ఇప్పుడు టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా కృషా బ్యారేజ్ కూల్చివేతకు వైసీపీ, జగన్ కుట్ర చేశారు అని ఆరోపిస్తున్నారు. బ్యారేజ్ ని ఢీకొన్న బోట్స్ కు వైసీపీ రంగులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. బోట్ ఓనర్స్ ను కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. చంద్రబాబు చెపుతున్నట్లు వైసీపీ కానీ..జగన్ కానీ కృష్ణా బ్యారేజ్ ను కూల్చే కుట్ర చేసి ఉంటే అంతకు మించిన దారుణం మరొకటి ఉండదు అని చెప్పొచ్చు.

అయితే ప్రభుత్వం దగ్గర ఈ విషయంలో ఆధారం ఉంటే టీడీపీ తన అధికారిక పేస్ బుక్ పేజీ లో చెపుతున్నట్లు జగన్ తో పాటు సజ్జల, తలశిల రఘురాం, నందిగం సురేష్ లపై ఈ విషయానికి సంబంధించి కేసు పెట్టాలి. అంతే కానీ..టీడీపీ పేస్ బుక్ పేజీ లో పోస్ట్ పెడితే ఏమి ఉపయోగం ఉంటుంది అని ఒక అధికారి ప్రశ్నించారు. ఇంత అధికారికంగా టీడీపీ పేజీ లో కూల్చేసే కుట్ర అని చెపుతూ...ప్రకాశం బ్యారేజీ కూల్చేసే కుట్ర వెనుక ఉన్నది ఈ దుష్ట చతుష్టయం.. జగన్, సజ్జల, తలశిల రఘురాం, నందిగం సురేష్ అని రాసి... ఇప్పటి వరకు వాళ్లపై కేసు లు పెట్టలేదు అంటే కారణం ఏంటి?. జగన్ ...సజ్జల విషయంలో కూడా కూటమి సర్కారు చూసీ చూసీ చూడనట్లు వదిలేస్తుంది అనుకోవాలా అన్న చర్చ తెర మీదకు రావటం ఖాయం అని ఒక టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా టీడీపీ ఇలా పేస్ బుక్ లో ఉత్తుత్తి పోస్ట్ లు పెట్టడం ..ఆరోపణలు చేయటం మినహా ఎలాంటి యాక్షన్స్ ఉండటం లేదు అన్నారు. దీంతో టీడీపీ తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పార్టీ కి ఏ మాత్రం లాభం చేయకపోగా..నష్టం చేసే అవకాశం ఉంది అని ఆ నేత ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story
Share it