Telugu Gateway
Andhra Pradesh

భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ లో జగన్ డబల్ గేమ్

భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ లో జగన్ డబల్ గేమ్
X

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసలు అవినీతి అంటే తనకు ఏ మాత్రం గిట్టదు అని..తాను అవినీతికి ఆమడ దూరం అన్నట్లు మాటలు చెపుతున్నారు. కాసేపు ఇదే నిజం అనుకుందాం. మరి అలాంటి జగన్ తాను స్వయంగా ఎయిర్ పోర్ట్ ఆథారిటీ అఫ్ ఇండియా (ఏఏఐ) కి భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ ఇస్తే డబ్బులు రావు అని చంద్రబాబు నాయుడు ఆ సంస్థకు వచ్చిన టెండర్ రద్దు చేసి ఒక ప్రైవేట్ కంపెనీ కి ప్రాజెక్ట్ కట్టబెట్టేలా నిబంధలు మార్చారు అని ఆరోపించారు. అది నిజమే. అంత వరకు బాగానే ఉంది. జీఎంఆర్ కు భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ కట్టబెట్టడంపై ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అంతే కాదు జగన్ ఫ్యామిలీ కి చెందిన సాక్షి పత్రికలో కూడా భోగాపురం ఎయిర్ పోర్ట్ లో భారీ స్కాం జరుగుతుంది అని..జీఎంఆర్ కంపెనీకి ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున రాయితీలు కూడా ఇవ్వబోతున్నారు అంటూ రాసింది. భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండర్ నిబంధనల్లో చేసిన మార్పులపై ఆర్థిక శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. అంతే కాదు జగన్ సర్కారు లో ముఖ్య సలహాదారు గా ఉన్న మాజీ సిఎస్ అజయ్ కల్లం కూడా భోగాపురంలో జీఎంఆర్ కోసం నిబంధనలు ఉల్లఘించి పెద్ద ఎత్తున అవినీతి చేశారు అని ఆరోపించారు. తాను అనుకున్న అవినీతి పని చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం తెగించింది అని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. సీన్ కట్ చేస్తే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను స్వయంగా ఆరోపణలు చేసిన భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ ను చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఓకే చేసిన జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ కే కట్టబెట్టారు.

పోనీ ఒప్పందంలో ఏమైనా మార్పులు చేశారా అంటే ఏమి లేదు..కేవలం గత ప్రభుత్వం చెప్పిన దానికంటే ఒక ఐదు వందల ఎకరాల భూమి తగ్గించారు తప్ప మిగతా అంతా పాత నిబంధనలే అని అధికారులు చెపుతున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే రైతుల దగ్గర నుంచి కారు చౌకగా తీసుకుని...ప్రభుత్వం నుంచి ఎన్నో రాయితీలు పొందిన కాకినాడ ఎస్ఈజెడ్ ప్రాజెక్టును జీఎంఆర్ ఇన్ఫ్రా జగన్ కు అస్మదీయ కంపెనీ అయిన ఆరబిందో రియాల్టీ కి విక్రయించింది. ఈ డీల్ పై అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేశారు. స్వయంగా జగన్, అయన సలహాదారు అజయ్ కల్లం లు అవినీతి అని ఆరోపించి భోగాపురం ఎయిర్ పోర్ట్ ను మాత్రం జీఎంఆర్ కే కట్టబెట్టారు. తనకు నచ్చితే మాత్రం ఆర్థిక శాఖ అభ్యంతరాలను కూడా పట్టించుకోరు అన్న మాట. జీఎంఆర్ కు ప్రాజెక్ట్ కట్టబెట్టడం వెనక తెరవెనక చాలా కథలు నడిచాయని అధికార వర్గాలు చెపుతున్నాయి. అవినీతిని ఏ మాత్రం సహించేది లేదు అని చెప్పే జగన్ అన్ని ప్రోజెక్టుల విషయంలో ఒకే లాగా ఉండాలి కదా. కానీ తనకు లాభం ఉండే పనులు చేసుకుంటూ మిగిలిన వాటి విషయంలో మాత్రమే మరో రకంగా వ్యవహరిస్తున్నారు అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది.

Next Story
Share it