Telugu Gateway
Andhra Pradesh

వైజాగ్ స్టీల్ పై రగులుతున్న విశాఖ

వైజాగ్ స్టీల్ పై రగులుతున్న విశాఖ
X

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకే వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కుండబద్దలు కొట్టి మరీ స్పష్టం చేశారు. ఏపీలోని ప్రజలు, రాజకీయ పార్టీలు అన్నీ ముక్తకంఠంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా మోడీ సర్కారు మాత్రం ఇదేమీ పట్టించుకోవటంలేదు. నిర్మలా సీతారామన్ ప్రకటన తర్వాత ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాంట్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మంగళవారం ఉదయం ఇవి మరింత తీవ్రరూపం దాల్చాయి. స్టీల్ ప్లాంట్ సీఎండీతోపాటు మరి కొంత మంది ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లగా..కొంత ఉన్నతాధికారులను కార్మికులు గేటు వద్దే అడ్డుకుని నిలబెట్టారు.

వీరిని ప్లాంట్ లోకి తీసుకెళ్ళేందుకు భద్రతా సిబ్బంది నానా తిప్పలు పడాల్సి వచ్చింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు, భద్రతా సిబ్బందికి మధ్య పెద్ద ఘర్షణే జరిగింది. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. అత్యంత కీలకమైన జీవీఎంసీ ఎన్నికల ముందు నిర్మలా సీతారామన్ ప్రకటన చేయటం అధికార వైసీపీని ఒకింత కలవరానికి గురిచేసందనే చెప్పాలి. అయితే ఇది ఈ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా లేదా అన్నది తేలాంటే మార్చి 14 వరకూ వేచిచూడాల్సిందే.

Next Story
Share it