Telugu Gateway
Andhra Pradesh

కేంద్ర అఫిడ‌విట్ పై విశాఖ స్టీల్ ఉద్యోగుల ఆగ్ర‌హం

కేంద్ర అఫిడ‌విట్ పై  విశాఖ స్టీల్ ఉద్యోగుల ఆగ్ర‌హం
X

ఎవ‌రెన్ని చెప్పినా కేంద్రం మాత్రం మందుకే అంటోంది. విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కితగ్గేదిలేదని ప‌దే ప‌దే తేల్చిచెబుతోంది. తాజాగా ఏపీ హైకోర్టులో దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ లోనూ ఇదే విష‌యాన్ని పున‌రుద్ఘాటించింది. పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌లో భాగంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని..ఇందులో జోక్యం చేసుకోవ‌టానికి ఎవ‌రికీ అధికారంలేద‌ని గ‌తంలో సుప్రీంకోర్టు కూడా ఈ మేర‌కు తీర్పు ఇచ్చిందంటూ అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే కేంద్ర వాద‌న‌పై విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు మాత్రం తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు.

గురువారం స్టీల్‌ప్లాంట్‌లో ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్వంలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగస్తులు పరిపాలన భవనం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో పరిపాలన భవనం వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్ప‌డింది. అంతే కాకుండా విధులకు వెళుతున్న కార్మికులను ఉద్యోగులు అడ్డుకుంటున్నారు. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని కేంద్రం చెబుతోంది.

Next Story
Share it