Telugu Gateway
Andhra Pradesh

విశాఖ విమానాశ్ర‌యంలోకి భారీగా నీరు

విశాఖ విమానాశ్ర‌యంలోకి భారీగా నీరు
X

గులాబ్ తుఫాన్ తో ఏపీ అల్ల‌క‌ల్లోలంగా మారింది. విశాఖ‌ప‌ట్నం విమానాశ్రంయ‌లోకి కూడా భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. దీంతో విమానాశ్ర‌యానికి వచ్చిన ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్ర‌యం ముందు భాగంతోపాటు లోప‌లికి కూడా భారీగా నీరు చేరింది. విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యంతోపాటు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాలు కూడా జ‌ల‌మ‌యం అయ్యాయి. ప‌లు కాల‌నీలు పూర్తిగా వ‌ర్షపునీటితో నిండిపోవ‌టంతో ప్ర‌జ‌లు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. గులాబ్ తుఫాన్ ప్ర‌భావం ఉత్త‌రాంధ్ర‌పై చాలా తీవ్రంగా ఉంది. ఈ ప్ర‌భావంతో ఆదివారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లను ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తొలగిస్తున్నాయి. కంట్రోల్‌ రూమ్‌ నుంచి అధికారులు ఫీల్డ్‌ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. చాలచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా‌ ఉంది. మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్ళరాద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా.. సురక్షితంగా ఇంట్లోనే ఉండాల‌ని విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ కె కన్నబాబు సూచించారు.

Next Story
Share it