Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి బర్త్ డే విషెస్ ట్వీట్ వైరల్

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి బర్త్ డే విషెస్ ట్వీట్ వైరల్
X

పాత విజయసాయిరెడ్డి ట్వీట్ ఎలా ఉంది...ఇప్పుడు కొత్త విజయసాయి రెడ్డి ట్వీట్ ఎలా ఉంది. ఈ రెండింటిని పోలుస్తూ సోషల్ మీడియా లో హల్చల్ సాగుతోంది. సహజంగా నచ్చితే ఏ నాయకుడికి అయినా మర్యాదగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పొచ్చు. ఇష్టం లేక పోతే మౌనంగా ఉండటం కూడా ఒక మర్యాద. వైసీపీ కీలకనేత , ఎంపీ విజయసాయి రెడ్డి సహజంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అంటే ఎప్పుడూ తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉండేవారు. చివరకు పుట్టిన రోజు కూడా దారుణమైన భాషతో ట్వీట్ చేసే వారు. దీనిపై టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున స్పందించేవి. ఈ సారి మాత్రం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గతానికి బిన్నంగా ట్వీట్ చేశారు. టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాఅంటూ రాశారు.

వాస్తవానికి ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. కానీ గత ట్వీట్లు చూస్తే మాత్రం విజయసాయిరెడ్డి లో ఎందుకు ఇంత మార్పు వచ్చింది అన్న అనుమానం మాత్రం రాక మానదు. గత కొంత కాలంగా విజయసాయిరెడ్డి వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం లేదు. ఎక్కడా పెద్దగా కనిపించటం కూడా లేదు.. ఇదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో అయన గతానికి బిన్నంగా టీడీపీ అధినేత చంద్రబాబు కు పుట్టిన రోజు విషెస్ చెపుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. విజయసాయిరెడ్డి ఎందుకు ఇంత మార్పు వచ్చింది అన్న చర్చ సాగుతుంది. మరి దీనిపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచిచుడాలి.

Next Story
Share it