టీవీ5పై విజయసాయిరెడ్డి ఫిర్యాదు
BY Admin3 March 2021 6:38 PM IST
X
Admin3 March 2021 6:38 PM IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి టీవీ5పై రాజ్యసభ సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి ఫిర్యాదు చేశారు. గత నెలలో చేసిన ఫిర్యాదుకు సంబంధించి వీడియో ఆధారాలు సమర్పించాల్సిందిగా రాజ్యసభ సెక్రటేరియట్ నుంచి డిప్యూటీ సెక్రటరీ హర్ ప్రతీక్ ఆర్య తాజాగా విజయసాయిరెడ్డికి లేఖ రాశారు. హక్కుల ఉల్లంఘనకు సంబంధించి డిప్యూటీ ఛైర్మన్ కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీవీ5లో ప్రసారం అయిన 'టాప్ స్టోరీ'కి సంబంధించిన వీడియో ఫుటేజ్ అందించాల్సిందిగా కోరారు.
తదుపరి చర్యలు తీసుకోవటానికి ఇది కావాలన్నారు. టీవీ5లో ప్రసారం అయిన టాప్ స్టోరీలో ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను కించపర్చేలా..అన్ని నిబంధనలు ఉల్లంఘించి స్టోరీని ప్రసారం చేశారని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు.
Next Story