Telugu Gateway
Andhra Pradesh

జగన్ టార్గెట్ గా వీరసింహరెడ్డి డైలాగులు!

జగన్ టార్గెట్ గా వీరసింహరెడ్డి డైలాగులు!
X

రాజకీయం. సినిమా కలసిపోయాయి. ఇప్పుడు ఎందులో చూసినా రాజకీయమే. బాలకృష్ణ హీరో గా నటించిన వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లేనిపోని చికాకులు కల్పించింది. తర్వాత అనుమతులు మంజూరు చేసింది. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా ఫంక్షన్ లో ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో డైలాగులు పొలిటికల్ ట్విస్ట్ ఉంది. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో..కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.

మార్చ లేరు అంటూ బాల కృష్ణ డైలాగు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును...జగన్ ప్రభుత్వం వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చిన అంశం టార్గెట్ గా చేసి పెట్టినట్లు స్పష్టం అవుతోంది. నాది ఫ్యాక్షన్ కాదు ..సీమ మీద ఏఫక్షన్..... పది నిమిషాల ముందు క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరకైనా వెళ్లి నిలబడు అక్కడ నీకు ఒక స్లోగన్ వినిపిస్తుంది అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగులు హైలైట్ గా ఉన్నాయి.మరి ఈ పొలిటికల్ డైలాగులపై అధికార వైసీపీ ఎలా స్పందిస్తోందో చూడాలి.


Next Story
Share it