Telugu Gateway
Andhra Pradesh

ఫోటో కోసం వందే భారత్ ఎక్కాడు...బుక్కయ్యాడు!

ఫోటో కోసం వందే భారత్ ఎక్కాడు...బుక్కయ్యాడు!
X

తెలుగు రాష్ట్రాల్లో కూడా తొలి వందే భారత్ ట్రైన్ వచ్చిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ నుంచి వైజాగ్ కు ఈ ట్రైన్ ప్రారంభం అయింది. ప్రధాని మోడీ వర్చ్యువల్ పద్దతిలో ఆదివారం నాడు ఈ ట్రైన్ సర్వీసులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సర్వీసులు ఇప్పుడు ప్రయాణికులకు సేవలు అందించటం స్టార్ట్ చేశాయి. వందే భారత్ ట్రైన్ల విషయం లో పెద్ద ఎత్తున ప్రచారం జరగటంతో అందరూ అసలు ఈ రైళ్లలో ఏమి ఉంది అన్న అంశాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే ఇందులో తాజాగా ఒక ఆసక్తి కర ఘటన చోటు చేసుకుంది. రాజమండ్రిలో ట్రైన్ ఆగిన సమయంలో ఒక వ్యక్తి ఫోటో తీసుకోవటానికి ట్రైన్ ఎక్కాడు. ఫోటో దిగి మళ్ళీ కిందకు దిగటానికి ట్రై చేస్తున్న సమయంలో డోర్స్ క్లోజ్ అయ్యాయి.

ఫోటో కోసం ట్రైన్ ఎక్కిన వ్యక్తి అక్కడే ఉన్న టిసి ని డోర్ ఓపెన్ చేయాల్సిందిగా కోరాడు. ఇక దిగటానికి ఉండదు అని...మళ్ళీ విజయవాడలోనే దిగాల్సిందే అని చెప్పటంతో అవాక్కు అవటం అతని వంతు అయింది. ఫోటో లు బయటి నుంచి తీసుకోవాలి కానీ లోపలి వస్తే ఎలా అంటూ సిబ్బంది అతనికి క్లాస్ పీకారు. ఈ వీడియో ఇప్పుడు వాట్సాప్ లో చక్కర్లు కొడుతోంది. అప్పటికి డోర్ ఓపెన్ చేయించేందుకు సంప్రదించినా అది సాధ్యం కాలేదు. ఈ కొత్త ట్రైన్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రైల్వే స్టేషన్స్ కు తరలి వస్తున్నారు.

Next Story
Share it