హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలింపు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఉన్న ఆయన్ను ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడ తరలిస్తున్నారు. అయితే ఏ కేసు లో వల్లభనేని వంశీ ని అరెస్ట్ చేసారు అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసు తో పాటు వల్లభనేని వంశీ పై పలు కేసులు ఉన్నట్లు పోలీస్ లు చెపుతున్నారు. తనపై నమోదు అయిన కేసుల్లో అరెస్ట్ లు వద్దు అని కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా పోలీస్ లు అక్రమ అరెస్ట్ చేశారు అని వంశీ ఆరోపిస్తున్నారు. ఏ కేసు లో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని వంశీ కుటుంబ సభ్యలు పోలీస్ లను కోరారు. ముందస్తు బెయిల్ ఉన్నా కూడా ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
అయితే ఇది వేరే కేసు గా చెపుతున్నారు. టీడీపీ అదికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ పై దూకుడుగా వ్యవహరించిన కొంతమందిపై చర్యలు ఉంటాయని ఆ పార్టీ నాయకులు భావించారు. నారా లోకేష్ కూడా రెడ్ బుక్ పేరుతో గతంలో హంగామా చేసిన సంగతి తెలిసిందే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు లేవు అని సొంత పార్టీ క్యాడరే కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేసి వదిలేసింది. ఈ తరుణంలో ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అవటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది కూడా ఏ మాత్రం పస లేని కేసు అయి ఉంటుంది అని...దీంతో వల్లభనేని వంశీ కు ఏమి కాదు అని కొంత మంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.