Telugu Gateway
Andhra Pradesh

పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తుల సెటిల్మెంట్స్!

పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తుల సెటిల్మెంట్స్!
X

ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖలో అనధికారిక సలహాదారు ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ వర్గాలు. ఏ ప్రభుత్వంలో అయినా ఆర్థిక శాఖ ఎంత కీలకమైనదో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి ఆర్థిక శాఖలో అనధికారిక సలహాదారు హవా చెలాయించటం ప్రభుత్వ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశగా మారింది. ఈ అనధికారిక సలహాదారు కొన్ని సార్లు అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తారు...ఎక్కువ శాతం తెర వెనక ఉండే వ్యవహారాలు అన్ని నడిపించేలా ఒక టీం ను కూడా రంగంలోకి దింపినట్లు సచివాలయ వర్గాలు చెపుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని కీలక శాఖల్లో అవినీతి పనులను అవుట్ సోర్సింగ్ కు ఇచ్చారు అని...వీళ్ళు ఎక్కువగా తెర మీద కనబడకుండా బయట ఆఫీస్ లు పెట్టుకుని..కావాల్సిన వాళ్ళను అక్కడకే పిలుచుకుని డీల్స్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అనధికారిక సలహాదారు మాత్రమే కాకుండా చాలా మంది ప్రైవేట్ వ్యక్తులు కూడా కీలక శాఖ వ్యవహారంలో తలదూర్చుతున్నట్లు చెపుతున్నారు. ఆర్థిక శాఖ పరిధిలో ఉండే అత్యంత కీలక మైన వాణిజ్య పన్నుల శాఖ కు సంబందించిన అంశాలపై కూడా ఈ సలహాదారు..మరో ప్రైవేట్ వ్యక్తి కలిసి సెటిల్మెంట్స్ చేస్తున్నారు అనే ప్రచారం ఆ శాఖ వర్గాల్లోనే ఉంది. పేషీ లోకి ఆ ప్రైవేట్ వ్యక్తిని కూడా సదరు సలహాదారే తీసుకువచ్చినట్లు కూడా చెపుతున్నారు. వీళ్ళు అంతా కలిసి పెండింగ్ లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని ఫైల్స్ క్లియర్ చేస్తూ పెద్ద మొత్తాల్లో దండుకుంటున్నారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. కొన్ని సార్లు వీటికి సంబంధించిన వ్యవహారాలు హైదరాబాద్ కేంద్రంగా కూడా సాగుతున్నాయి అని ఒక అధికారి తెలిపారు. ఏది ఏమైనా కూడా కంట్రోల్ మొత్తం ఈ అనధికారిక సలహాదారుడిదే కావటం విశేషం. విచిత్రం ఏమిటి అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెండింగ్ బిల్స్ క్లియర్ చేసే సమయంలో ఆ కాంట్రాక్టర్ల సామాజివర్గం...వాళ్ళు ఏ పార్టీ తో అయినా లింక్ లు కలిగి ఉన్నారా వంటి అంశాలను పరిశీలించిన తర్వాత భారీ మొత్తంలో కమిషన్లు తీసుకుని బిల్స్ క్లియర్ చేసారు అనే ఆరోపణలు ఉండగా...విచిత్రం ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కి చెందిన వాళ్ళకే బిల్స్ వేగంగా క్లియర్ అవుతున్నాయి అని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి.

విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ నేత ఒకరు ఆర్థిక శాఖలో తన బిల్ క్లియర్ చేసుకోవటం కోసం పది శాతం కమిషన్ ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాలే చెపుతున్నాయి. ఆఫీస్ కు వెళ్లిన కొంత మంది ప్రైవేట్ వ్యక్తులకు ఇదే తరహా సమస్యలు ఎదురైనట్లు నేతలు చెపుతున్నారు. సొంత పార్టీ వాళ్లకు క్లియర్ కానీ బిల్స్..వైసీపీ కి చెందిన వాళ్లకు...వాళ్ళ సన్నిహితులకు మాత్రం అత్యంత వేగంగా క్లియర్ అవుతున్నాయి అని అధికార పార్టీ నేతలు వాపోతున్నారు. విచిత్రం ఏమిటి అంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి చెందిన కీలక సమాచారం బయటకు చేరవేస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ కు గురైన వ్యక్తుల్లో ఒకరు ఆర్థిక మంత్రి పేషీలో అత్యంత కీలకమైన బాధ్యతలు చూస్తుంటే మరో వ్యక్తి ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న యువ నేత దగ్గర పని చేస్తున్నారు అని సచివాలయ వర్గాలు వెల్లడించాయి.

Next Story
Share it