Telugu Gateway
Andhra Pradesh

జగన్ మోడల్ ఫాలో అవుతున్న బాబు

జగన్ మోడల్ ఫాలో అవుతున్న బాబు
X

అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత వస్తుంది అని ఎవరూ ఊహించలేదు. ఇవి ఎవరో ప్రజలు అనుకుంటున్న మాటలు కావు. అధికార టీడీపీ ఎమ్మెల్యేల్లో నెలకొన్న అభిప్రాయం. ఎన్నికల ముందు..ఎన్నికల ప్రచారంలోనూ తన అంత ప్రజాస్వామ్య యుతంగా ఎవరూ ఉండరు అని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు సొంత పార్టీ కి చెందిన సీనియర్ నేతలు...ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదు అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. పైగా ఎవరైనా పార్టీ మేలు కోరి ఏదైనా సలహా...సూచన వంటివి చేసినా కూడా వాటిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకపోగా...ఈ సారి గతంలో లాగా ఉండదు..అందరి సంగతి తనకు తెలుసు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానిస్తుండటంతో ఎవరికివాళ్లు క్షేత్ర స్థాయిలో జరిగే విషయాలను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లటం మానేశారు. అవసరానికి మించిన మెజారిటీ వస్తే నాయకులు ఎలా వ్యవహరిస్తారో ప్రత్యక్ష ఉదాహరణ 2019 లో జగన్ అయితే....ఇప్పుడు చంద్రబాబు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇంచుమించు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు చాలా విషయాల్లో జగన్ మోడల్ ఫాలో అవుతున్నారు అనే చర్చ సాగుతోంది. టీడీపీ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు అధికారికంగా సీఎం సీటు లో ఉన్నారు కానీ..కీలక నిర్ణయాలు అన్ని కూడా యువ నేత చేతిలోకి వెళ్లిపోయాయి అనే చర్చ సాగుతోంది. అందుకే పరిపాలనతో పాటు పలు విషయాల్లో ప్రభుత్వ డొల్లతనం ఎక్కడికి అక్కడ బయటపడుతుంది అనే అభిప్రాయాన్ని టీడీపీ మంత్రులు, నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ముఖ్యంగా జగన్ ఐదేళ్ల పాలనా కాలంలో సాగిన అక్రమాలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఇప్పటి వరకు ఎక్కడా కఠిన చర్యలు తీసుకోకపోగా...పలు కీలక విషయాల్లో సెటిల్మెంట్స్ కు వెళ్లారు అనే ఆరోణలు టీడీపీ నేతలను కూడా షాక్ కు గురి చేస్తోంది. మరో వైపు కూటమి ప్రభుత్వంలో రెండు ప్రధాన పార్టీ లు కౌంటర్ లు ఓపెన్ చేశాయని ఒక కౌంటర్ కు కిమ్ సారథ్యం వహిస్తుంటే...మరో పార్టీ కౌంటర్ కు లింగా నాయకత్వం వహిస్తున్నట్లు చెపుతున్నారు.

మూడవ పార్టీ కంట్రోల్ ఢిల్లీ లో ఉండటం తో లోకల్ నాయకత్వం ఎవరి స్థాయిలో వాళ్ళు పనులు చేస్తుకుంటున్నట్లు చెపుతున్నారు. రెండు ప్రధాన పార్టీ నాయకులు ప్రజలకు మేలు చేయటం అనే అంశం సంగతి అటుంచి కాంట్రాక్టు లు...పవర్ ప్రాజెక్ట్ లు...మైనింగ్ వంటి విషయాల్లో జోక్యం చేసుకుని వందల కోట్ల రూపాయలు దోపిడీకి స్కెచ్ వేస్తున్నారు అనే చర్చ రెండు పార్టీల నేతల్లో సాగుతోంది. కీలక నేతలే ఇదే మోడీలు ఫాలో అవుతుండంతో కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే అదనుగా ఎవరి స్టైల్ లో వాళ్ళు వనరులు వచ్చే మార్గాలను వెతుకుంటున్నారు. తాము నేరుగా డీల్స్ చర్చల్లో పాల్గొనకుండా పవర్ బ్రోకర్లతో పని కానిచ్చేస్తే ఎవరికీ తెలియదు అనే అభిప్రాయంతో ఒక పార్టీ నేత ఉన్నారు అనే చర్చ కూడా అధికార వర్గాల్లో సాగుతోంది.

Next Story
Share it