తిరుమలలో సర్వ దర్శనాలు ప్రారంభం
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంత కాలం సామాన్య భక్తులకు దూరమైన దర్శన భాగ్యం తిరిగి ప్రారంభం కానుంది. అది కూడా సెప్టెంబర్ 8 నుంచి సర్వదర్శనం పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 8 ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. రోజుకి 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో సర్వరద్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపింది.
తొలి దశలో ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే సర్వ దర్శంన టోకెన్లు జారీని పరిమితం చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. కరోనా విజృంభణ కారణంగా 6 నెలలుగా సర్వదర్శనాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. కేసులు కాస్త తగ్గుముఖం పడుతుండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇతర జిల్లాల వారికి కూడా ఈ దర్శన భాగ్యం విస్తరించే అవకాశం ఉంది.అయితే ఇది భవిష్యత్ లో వచ్చే కేసుల సంఖ్య ఆధారంగా ఉంటుంది.