వర్మ సినిమాల నిర్మాతకు టీటీడీ బోర్డు పదవి
దీనికి ఎంతో కీలకమైన టీటీడీ ని వాడుకుంటున్నారు. అయితే ఇలా మొదటి సారి జరిగింది అని చెప్పటానికి లేదు. ఎందుకు అంటే ఎవరు అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు అలాగే చేస్తున్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేశారు. ఇప్పుడు జగన్ కూడా అదే లైన్ లో ఉన్నారు. టీడీపీ ఎన్నికల ప్రచారానికి సంబదించిన పాటలు...యాడ్స్ తయారీ వంటి వాటి విషయంలో సహకరించినందుకు దర్శకుడు రాఘవేందర్ రావు కు అప్పట్లో చంద్రబాబు టిటిడీలో పలు పదవులు కట్టబెట్టారు. ఇప్పుడు వైసీపీ అధినేత, సీఎం జగన్ కూడా తన కోసం సినిమాలకు నిర్మాతగా వ్యవహరించనున్న కిరణ్ కుమార్ కు టీటీడీ పదవి కట్టబెట్టారు. రాంగోపాల్ వర్మ దేవుడిని నమ్మను అని చెపుతారు కాబట్టి సరిపోయింది లేకపోతే టీటీడీ లో ఆయనకు ఏదో ఒక పదవి దక్కేది అంటూ కొంత మంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.