Telugu Gateway
Andhra Pradesh

మ‌రోసారి ట్రోల‌ర్స్ కు చిక్కిన జ‌గ‌న్

మ‌రోసారి ట్రోల‌ర్స్ కు చిక్కిన జ‌గ‌న్
X

గ‌ర్భం బ‌దులు..గ‌ర్వం..గ‌ర్వం అంటూ దొరికేశారు

ప్ర‌తి అక్క‌కు..చెల్లెకు మంచి జ‌ర‌గాల‌ని చెప్పి ఈ ప్ర‌భుత్వం మొట్ట‌మొద‌టి రోజు నుంచి అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే చెల్లెమ్మ‌ల‌కు తోడుగా ఉండేందుకు..ఆ చెల్లెమ్మ‌లు గ‌ర్వం దాల్చిన వెంట‌నే...ప్ర‌తి చెల్లెమ్మ‌కు తోడుగా..అండ‌గా ఉండేందుకు వీలుగా ర‌క‌ర‌కాల కార్య‌క్ర‌మాలు చేస్తున్నాం. అందులో భాగంగానే..గ‌ర్వం...గ‌ర్భ‌వ‌తి అయిన చెల్లెమ్మ 108కి ఫోన్ చేస్తే ఫోన్ కొట్టిన వెంట‌నే వాహ‌నం అక్క‌డ‌కు వ చ్చి ఆస్ప‌త్రికి తీసుకెళ్ళ‌ట‌మే కాకుండా..ఆస్ప‌త్రిల్లో నాణ్య‌మైన సేవ‌లు కూడా అందిస్తూ..అత్యంత నాణ్య‌తతో కూడిన మందులు అందిస్తామ‌న్నారు.

సిజేరియ‌న్ అయితే ఆ మ‌హిళ‌కు మూడు వేల రూపాయ‌లు, స‌హ‌జ ప్ర‌స‌వం అయితే ఆ మ‌హిళ‌ల‌కు ఐదు వేల రూపాయ‌లు ఆరోగ్య ఆస‌రా కింద ఆ చెల్లెమ్మకు విశ్రాంతి స‌మ‌యంలో స‌హాయం కింద అందజేయ‌నున్న‌ట్లు తెలిపారు. శుక్ర‌వారం నాడు విజ‌య‌వాడ‌లో వైఎస్ఆర్ త‌ల్లీ,బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహ‌నాల‌ను ప్రారంభిస్తూ సీఎం జ‌గ‌న్ మాట్లాడారు. అక్క‌డే ప‌దే ప‌దే ఆయ‌న గ‌ర్భం బ‌దులు...గ‌ర్వం ..గ‌ర్వం అంటూ మ‌రోసారి ట్రోల‌ర్స్ కు చిక్కారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Next Story
Share it