Telugu Gateway
Andhra Pradesh

టాలీవుడ్ చ‌ర్చ‌లు.... సెల‌క్షన్ ఎవ‌రిది?

టాలీవుడ్ చ‌ర్చ‌లు.... సెల‌క్షన్ ఎవ‌రిది?
X

ప‌రిశ్ర‌మ అంటే ఏ ఒక్క‌రిదో కాదు..అంద‌రూ క‌ల‌సి ఉమ్మ‌డిగా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాలి. స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం అంద‌రి స‌మ‌స్య‌ల‌ను కొంత మంది ఉప‌యోగించుకూడ‌దు అంటూ తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ప్రెసిడెంట్ మంచు విష్ణు వ్యాఖ్యానించారు. గ‌తంలో జ‌రిగిన ఏపీ సీఎం జ‌గ‌న్, చిరంజీవిల భేటీ వ్య‌క్తిగ‌తం అని..ఇది ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన అంశం కాద‌ని పేర్కొన్నారు. ఇప్పుడు గురువారం నాడు మ‌రోసారి ఏపీ సీఎం జ‌గ‌న్ తో చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి. అస‌లు ఈ చర్చ‌ల్లో పాల్గొనే వారిని ఎంపిక చేస్తుంది ఎవ‌రు?. ప్ర‌భుత్వం త‌న‌కు న‌చ్చిన వారిని ఆహ్వానిస్తుందా?. అందులో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు, ఫిల్మ్ చాంబ‌ర్ ప్ర‌తినిధులు ఉంటారా?. ముందు నుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లు చిరంజీవి, నాగార్జున‌తోపాటు ఎంపిక చేసిన కొంత మంది మాత్ర‌మే ఉంటారా?. ఈ చ‌ర్చ‌లకు టాలీవుడ్ నుంచి ఎవ‌రెవ‌రు రావాలి అన్న‌ది నిర్ణ‌యించేది ఎవ‌రు?. ఇది ప‌రిశ్ర‌మ త‌ర‌పున జ‌రుగుతుందా? లేక ప్ర‌భుత్వం త‌ర‌పున జ‌రుగుతుందా అన్న అంశంపై ఎవ‌రికీ స్ప‌ష్ట‌త లేదు.

టిక్కెట్ ధ‌ర‌ల అంశంతోపాటు టాలీవుడ్ కు చెందిన అంశాల‌పై ఏపీ మంత్రి పేర్ని నాని బుధ‌వారం నాడు సీఎం జ‌గ‌న్ తో భేటీ అయి చ‌ర్చించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సిని ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు గురువారం నాడు సీఎం జ‌గ‌న్ తో స‌మావేశం కానున్నార‌ని తెలిపారు. సినిమా టికెట్‌ ధరల అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్నినాని స్పష్టం చేశారు. థియేటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్లు కమిటీకి ప్రతిపాదనలిచ్చారని, సినీ పెద్దల నుంచి తమకు ఇప్పటివరకు ప్రతిపాదన రాలేదని పేర్నినాని తెలిపారు. సినిమా టికెట్‌ ధరలపై కమిటీ రిపోర్ట్ ఇంకా రాలేదని, కమిటీ రిపోర్ట్ వచ్చాక దానిపై చర్చిస్తామని మంత్రి పేర్నినాని చెప్పారు. తమ్మారెడ్డి తనకు సమస్యను వివరిస్తే..పరిష్కరిస్తామని మంత్రి పేర్నినాని అన్నారు.

Next Story
Share it