ఇంద్రకీలాద్రి దగ్గర కలకలం
BY Admin21 Oct 2020 5:27 PM IST
X
Admin21 Oct 2020 5:27 PM IST
విజయవాడలోని అమ్మవారి గుడి వద్ద కలకలం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు ఇచ్చేందుకు రావటానికి కొద్ది సమయానికి ముందు కొండచరియలు విరిగిపడటంతో కలకలం రేగింది. అదే రూటులో సీఎం కూడా వెళ్లాల్సి ఉంది. విరిగిపడ్డ కొండచరియలతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కొండచరియలు పడటంతో అక్కడ ఏర్పాటు చేసిన రేకుల షెడ్లు కూలిపోయాయి. సీఎం పర్యటన కోసం ఆ మార్గంలో ఎవరూ అనుమతించకపోవటం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. ఇటీవల చిన్న చిన్న రాళ్లు విరిగిపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి సీఎం పర్యటన కోసం రూట్ క్లియర్ చేయించారు.
Next Story