మతాల మధ్య చిచ్చుకు చంద్రబాబు ప్రయత్నాలు
BY Admin5 Jan 2021 10:27 AM

X
Admin5 Jan 2021 10:27 AM
మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రామతీర్థం ఘటనపై విచారణలో అసలు రంగు బయటపడుతుందని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రామతీర్థం ఘటన జరిగిన వెంటనే మేం స్పందించామని, ఆలయ ఛైర్మన్ అశోక్‌గజపతిరాజు ఎందుకు వెళ్లలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. ''వాటికన్ సిటీకి, అమరావతికి సంబంధం ఏంటి?.
చంద్రబాబు అమరేశ్వరుని భూములు కూడా దోచుకున్నారు. చంద్రబాబు పవిత్రమైన హిందువైతే విజయవాడలో ఆలయాలను ఎందుకు కూల్చారు?. ఆలయాలను కూల్చినప్పుడు చంద్రబాబుకు హిందువులు గుర్తురాలేదా? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.
Next Story