Telugu Gateway
Andhra Pradesh

కీలక నేతకు ఝలక్ ఇచ్చిన టీడీపీ ఎంపీ!

కీలక నేతకు ఝలక్ ఇచ్చిన టీడీపీ ఎంపీ!
X

ఆ ఎంపీ వైసీపీ నుంచి టీడీపీ లోకి వెళ్లారు. వైసీపీ లో ఉన్నప్పుడు ఎలా హవా చెలాయించారో అలాగే ఇప్పుడు టీడీపీ లో కూడా అయన హవా అలాగే సాగుతోంది. ఆయన గతంలోనే వైజాగ్ లో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. కాస్ట్ లీ విల్లా లతో అక్కడ అంతా ఒక రేంజ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేయటానికి అంతా సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కు అన్ని అనుమతులు గత ప్రభుత్వంలోనే వచ్చేశాయి. అయినా ఇప్పుడు ఆ ఎంపీ అధికార టీడీపీ లో ఉన్నాడు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ఈ భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టిన ఆయన ఒక కీలక నేతకు పది ఎకరాలు బదలాయిస్తానని మాట ఇచ్చారు. ఇటీవల ఆ కీలక నేత తనకు ఇస్తానన్న పది ఎకరాలు ఇవ్వాలని కబురు పంపించారు సదరు ఎంపీకి. ఇప్పుడు ఇవ్వాల్సింది ఏమీ లేదు అని ఆ ఎంపీ సమాధానం ఇవ్వటంతో అవాక్కు అవటం ఆ కీలక నేత వంతు అయింది.

అంతే కాదు..ఇప్పుడు సదరు ఎంపీపై ఆయన తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు చెపుతున్నారు. ఆ ఎంపీ రాజకీయం అంటే వ్యాపారం అన్నట్లే వ్యవహరిస్తారు. ఎక్కడ ఉన్నా కూడా అదే స్టైల్ లో పని చేసుకుంటూ పోతారు. ఇప్పుడు కూడా ఆయన పార్టీ కోణంలో కంటే ...తన వ్యక్తిగత ఎజెండా...వ్యాపార ఎజెండా ప్రకారమే ముందుకు సాగుతున్నారు అని టీడీపీ వర్గాలు కూడా చెపుతున్నాయి. కేవలం డబ్బులు ఉన్నాయనే కారణంతోనే ఆయన ఇప్పుడు టీడీపీ లో కూడా అదే హవా చెలాయిస్తున్నారు అని చెపుతున్నారు. కీలక నేతకు ఆ ఎంపీ హ్యాండ్ ఇచ్చిన భూమి విలువే దగ్గర దగ్గర 300 కోట్ల వరకు ఉండొచ్చు అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Next Story
Share it