Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు నిర్ణయంపై నాని మౌనం..టీడీపీ నేతల షాక్

చంద్రబాబు నిర్ణయంపై నాని మౌనం..టీడీపీ నేతల షాక్
X

విజయవాడ ఎంపీ కేశినేని నాని కి ఈ సారి టికెట్ లేదు అని తెలుగు దేశం అధిష్టానం స్పష్టం చేసింది. పార్టీ ప్రతినిధుల ద్వారా నానికి ఈ సమాచారం పంపారు. ఈ విషయాన్ని కేశినేని నాని స్వయంగా సోషల్ మీడియా వేదికగా బహిరంగపర్చారు. ‘నిన్న సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా ,ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టం రఘురాం మరియు మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ నన్ను కలసి 7 వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇంచార్జ్ గా చంద్రబాబు గారు నియమించారని కాబట్టి ఆ విషయంలో నన్ను కలగ చేసుకోవద్దని చంద్రబాబు గారు నాకు చెప్పమన్నారని తెలియచేశారు.

అట్లాగే రాబోయే ఎన్నికలో నా స్థానంలో విజయవాడ లోకసభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని నాకు తెలియచేశారు .అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి నేను హామీ ఇచ్చాను .’ అంటూ పేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. సహజంగా కేశినేని నాని దూకుడుగా వ్యవహరిస్తారు. అలాంటిది టికెట్ ఇవ్వటం లేదు అని చెప్పినా కూడా ఇంత ప్రశాంతంగా ..మౌనంగా ఉండటం వెనక కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది. ఇది తుఫాను ముందు ప్రశాంతతా ...లేక కేశినేని నాని మౌనం వెనక ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది.

Next Story
Share it