Telugu Gateway
Andhra Pradesh

బాబు కూడా బాగా రిచ్ ..ఆయన ఆస్తులు 650 కోట్ల రూపాయలు

బాబు కూడా బాగా రిచ్ ..ఆయన ఆస్తులు 650 కోట్ల రూపాయలు
X

తాజాగా అసోసియేషన్ అఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) దేశం లోని ముఖ్యమంత్రుల ఆస్తులు వివరాలు బహిర్గతం చేసింది. వాటితో పాటు రాష్ట్రాల వారీగా కూడా ఎమ్మెల్యే ఆస్తుల వివరాలు వెల్లడించింది. అయితే ఇవన్నీ వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన డేటా ను క్రోడీకరించి తయారు చేసిన నివేదికలు. ముఖ్యమంత్రుల్లో అంధ ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి 510 కోట్ల రూపాయలతో దేశంలోనే నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు. అయితే ఇదే జాబితాలో ఎమ్మెల్యే ల వివరాలు కూడా ఉన్నాయి. ఇందులో టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆస్తులు కూడా ఉన్నాయి. అవి ఎంత అంటే ఏకంగా 650 కోట్ల రూపాయలు. సీఎం జగన్ కంటే చంద్రబాబు ఆస్తులు ఎక్కువగా ఉండటం ఇక్కడ మరో విశేషంగా చెప్పుకోవచ్చు.

ఎమ్మెల్యే కేటగిరీ లో కర్ణాటక కు చెందిన నాగ రాజు ఆస్తులు వెయ్యి కోట్ల రూపాయలతో సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. ఆయన కాంగ్రెస్ టికెట్ పై గెలిచి తర్వాత బీజేపీ లో చేరారు. అయన తర్వాత స్థానంలో కర్ణాటక పీసిసి ప్రెసిడెంట్, ఎమ్మెల్యే డీ కె శివ కుమార్ ఉన్నారు. అయన ఆస్తులు 840 కోట్ల రూపాయలు. చంద్రబాబు తర్వాత గుజరాత్ కు చెందిన జయంతిభాయ్ సోమాభాయ్ పటేల్ ఉన్నారు ఆయనకు 661 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇక్క్డడ మరో విచిత్రం ఏమిటి అంటే త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో దేశంలోనే సంపన్న ఎమ్మెల్యే ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా ఉంది. మొత్తం మీద కోటీశ్వరులు కానీ ఎమ్మెల్యేలు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. అక్కడక్కడా కొన్ని మినహాయింపులు ఉండొచ్చు. కానీ ఎక్కువమంది మాత్రం సంపన్నులే.

Next Story
Share it