జగన్ టార్గెట్ క్లియర్
ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అధికారులు కొంత మంది మీడియా సమావేశాలు పెట్టి మరీ మార్గదర్శి పెద్ద ఎత్తున నిబంధనలు ఉల్లంఘింస్తోంది అని ఆరోపిస్తున్నారు. వీటిని మార్గదర్శి యాజమాన్యం కూడా ఖండిస్తూ వస్తోంది. అయినా కూడా ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు మార్గదర్శి పై జాకెట్ యాడ్స్ తో యుద్ధం ప్రకటించింది. ఇందులోని ఒక్కో అంశానికి మార్గదర్శి కూడా వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే కోర్టు కు చేరిన ఈ విషయం తేలాల్సింది కూడా అక్కడే. కానీ ప్రజల సొమ్ముతో జగన్ సర్కారు ఇలా మార్గదర్శిపై ప్రకటనలు ఇవ్వడంపై అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సర్కారు ఇంత చేస్తున్నా కూడా మార్గదర్శి ఖాతాదారులు ఎవరు కూడా ఆందోళనతో బయటకు వస్తున్న దాఖలాలు లేవు. సీఎం జగన్ కసి కోసం అప్పుల తెచ్చి మరీ ఇలా కోట్ల రూపాయలు ప్రకటనలపై ఖర్చు పెట్టాలా అని ఒక ఐఏఎస్ విస్మయం వ్యక్తం చేశారు.