పరీక్షల రద్దు మంచి నిర్ణయం
ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్వాగతించింది. అయితే ఈ నిర్ణయం ముందే తీసుకుని ఉండే బాగుండేదని వ్యాఖ్యానించింది. పరీక్షల రద్దు మానవీయతకు సంబంధించిన అంశం అని పేర్కొంది. సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ సందర్భంగా నిన్న ఈఅంశంపై ఏమి చర్చించరని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కోర్టు విచారణ అనంతరం సీఎం పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏపీ పరీక్షల రద్దు విషయాన్ని ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా న్యాయవాది దవే మాట్లాడుతూ..''ఎన్నికల ర్యాలీలు, సభలు జరిగాయని సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. పరీక్షల నిర్వహణకు సిద్ధమైనప్పటికి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేశాము. పది రోజుల్లో హైపవర్ కమిటీ అసెస్‌మెంట్ స్కీమ్‌ను రూపొందించి జూలై 31 లోపు ఫలితాలను ప్రకటిస్తుందని తెలిపారు. దేశం మొత్తం ఒక వైపు ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక మార్గంలో వెళ్ళలనుకోవడం లేదని తాము భావించాము.. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కుంభ మేళాలో జరిగిన దానికి ఎవరూ బాధ్యత తీసుకోలేదంటూ'' ఆయన తెలిపారు.