Telugu Gateway
Andhra Pradesh

రాజ్యాంగ విచ్ఛిన్నం పిటీషన్ల విచారణపై సుప్రీం స్టే

రాజ్యాంగ విచ్ఛిన్నం పిటీషన్ల విచారణపై సుప్రీం స్టే
X

రాష్ట్రంలో రాజ్యంగ వ్యవస్థ విచ్ఛిన్నం అయిందని ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ఆక్షేపించింది. హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు కలవరపరిచేలా ఉన్నాయని పేర్కొంది. హైకోర్టు ఆదేశాలు, విచారణ తీరును కూడా సుప్రీం తప్పు పట్టింది. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థ ఏమీ కుప్పకూలలేదు కదా? అని ప్రశ్నించింది. ఈ అంశంపై గత కొన్ని రోజులుగా ఏపీ సర్కారు, హైకోర్టు మధ్య తీవ్ర వాదోపవాదాలు సాగుతున్నాయి. ఇదే అంశంపై ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగ విఛ్చిన్నంపై నిర్ణయం తీసుకునే అధికారం హైకోర్టుకు లేదని ఏపీ ప్రభుత్వం తన పిటీషన్ లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ఈ అంశంపై విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

తరువాత విచారణ శీతాకాలం సమావేశాల తర్వాత చేపడతామని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ బోడ్డే నేతృత్వంలోని బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో పోలీసుల చట్ట ఉల్లంఘనలపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటీషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజధాని తరలింపు విషయంలో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ వేసిన పిటీషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

Next Story
Share it