Telugu Gateway
Andhra Pradesh

చంద్ర‌బాబు ఒత్తిడితోనే అలా!

చంద్ర‌బాబు ఒత్తిడితోనే అలా!
X

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుపై అధికార వైసీపీ నేత‌ల ఎటాక్ ఆగ‌టంలేదు. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌ల‌కు ఉద్దేశించిన ఏజెండాలో ప్ర‌త్యేక హోదా అంశం తొలగింపు వెన‌క చంద్రబాబు ఉన్నార‌ని ఆ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కూడా ఆ జాబితాలో చేరారు. ' చంద్రబాబు నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే ఇలా చేశారు. ప్రత్యేక హోదా వద్దని అమ్ముడుపోయింది టీడీపీ నేతలే. ప్రత్యేక ప్యాకేజీ కావాలని తీసుకుంది టీడీపీనే.

ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదు. ఏపీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే సీఎం జగన్‌ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన నామమాత్రంగానే ఉన్నాయి. ఈ రెండు పార్టీలు లోపాయికారిగా చంద్రబాబుతో చేరతాయి. గడచిన మూడురోజులుగా జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని' మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story
Share it