Telugu Gateway
Andhra Pradesh

లూలు పై చంద్రబాబు ప్రత్యేక ప్రేమ!

లూలు పై చంద్రబాబు ప్రత్యేక ప్రేమ!
X

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...లూలు గ్రూప్ సీఎండీ ఎంఏ యూసుఫ్ అలీ కి మధ్య ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ఫోటో చూస్తే కూడా వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎలాంటిదో అర్ధం అవుతోంది. ఫస్ట్ నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మోడల్ ఒకటే. ప్రభుత్వ భూములు కారు చౌకగా కార్పొరేట్లకు రాసిచ్చి...వాళ్ళు కోరినన్ని రాయితీలు ఇచ్చేసి వాళ్ళతో దార్శనికుడు అని పొగిడించుకోవటం....కార్పొరేట్ సెక్షన్స్ లో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవటం. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కూడా అది అలాగే కొనసాగుతోంది. అమరావతి లో దిగ్గజ కంపెనీలతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నారు..బిట్స్ వంటి ఇతర ప్రతిష్టాత్మక సంస్థలు తెస్తున్నారు అంటే అది రాష్ట్రానికి మంచిది...స్వాగతించతగ్గ పరిణామమే. కానీ ఇప్పుడు ఒక కంపెనీ మాల్ కట్టడం అన్నది ఏ మాత్రం పెద్ద విషయం కాదు. ఇప్పటికే విజయవాడ లో ఎన్నో ప్రైవేట్ మాల్స్ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం లూలు గ్రూప్ పై ఎంతో ప్రత్యేక ప్రేమ చూపిస్తూ విజయవాడలోని ఆర్ టి సి డిపో కు చెందిన స్థలాన్ని కూడా మాల్ కోసం ఆ కంపెనీకి రాసివ్వాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం నాడు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఆర్ టిసి స్థలం 4 .15 ఎకరాలను లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్ఐఎస్ఎం) కు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి గాను ఆర్ టిసి కి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ప్రభుత్వ జీఓ లోనే రెవిన్యూ శాఖను, జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఆంధ్ర ప్రదేశ్ టూరిజం ల్యాండ్ అలాట్ మెంట్ పాలసీ 2024 -2029 కింద ఈ భూ కేటాయింపులు చేశారు. విజయవాడ తో పాటు వైజాగ్ లో కూడా లూలూ మాల్ కు ప్రభుత్వం కారు చౌకగా కేటాయించారు. ఇప్పుడు విజయవాడ లో 4 .15 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం భూములు కేటాయించిన సంగతి తెలిసిందే. వైజాగ్ లో ఈ సంస్థకు 13 .74 ఎకరాలు తీసుకున్నారు. ఈ రెండు కూడా 99 సంవత్సరాల పాటు ఆ కంపెనీ చేతిలోనే ఉంటాయి.

వందల కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలాలను లీజ్ పై కేటాయిస్తున్నారు. రెండు చోట్ల కూడా మాల్స్ నిర్మాణము పూర్తి అయ్యే మూడేళ్ళ కాలంలో ఎలాంటి లీజ్ ఉండదు. అంటే వాళ్ళు వ్యాపారం ప్రారంభించినప్పటి నుంచే లీజ్ కట్టాల్సి ఉంటుంది అనే వెసులుబాటు కూడా కల్పించారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే విజయవాడ లో ఆ కంపెనీ కి కేటాయించే భూమి విలువ కంటే కంపెనీ పెట్టే పెట్టుబడి ఎంతో తక్కువ కావటం. ఇక్కడ లూలు మాల్ 156 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 . 32 లక్షల చదరపు అడుగుల్లో షాపింగ్ మాల్ నిర్మించబోతోంది. ఒక సారి 99 సంవత్సరాలకు లీజ్ అగ్రిమెంట్ పూర్తి అయిన తర్వాత ఈ స్థలాన్ని బ్యాంకు లో తనఖా పెట్టి రుణం తీసుకుని ఈ కంపెనీ ప్రాజెక్ట్ లను అమలు చేసే అవకాశం ఉంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. లూలు కు ఉండే బ్రాండ్...వ్యాపార అవకాశాలను దృష్టిలో పెట్టుకుని వందల కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలాలకు రుణాలు కూడా ఎంతో ఈజీ గానే వస్తాయని అధికారులు కూడా చెపుతున్నారు. అలా ఉంటది చంద్రబాబు మోడల్ అంటే మరి.

Next Story
Share it