Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు అరెస్ట్

చంద్రబాబు అరెస్ట్
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ని ఆంధ్ర ప్రదేశ్ సిఐడి అరెస్ట్ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే దీనికి ఏర్పాట్లు చేసుకుని..శనివారం ఉదయం చంద్రబాబు ను అదుపులోకి తీసుకున్నారు. తనను అరెస్ట్ చేయటానికి వచ్చిన సిఐడి అధికారులతో చంద్రబాబు వాదనకు దిగారు. అసలు ఈ కేసు కు సంబందించిన ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదు అని చెప్పగా...ఎఫ్ఐ ఆర్ ఎప్పుడో నమోదు అయింది అని...అరెస్ట్ అంతంతరం అన్ని వివరాలు అందిస్తామని సిఐడి అధికారులు తెలిపారు. దీనిపై చంద్రబాబు అభ్యంతరం చెప్పగా..మాజీ ముఖ్యమంత్రి అయిన తనకు అసలు ఏ కేసు లో..ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో..కారణాలు చెప్పకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ ప్రశ్నించారు.

సామాన్యుడికి అయిన విషయం చెప్పి అరెస్ట్ చేయాలనీ..కానీ ఇలా చేయటం సరి కాదు అంటూ వ్యాఖ్యానించారు. అరెస్ట్ తర్వాతే రిమాండ్ రిపోర్ట్ లో అన్ని అంశాలు వెల్లడిస్తామని అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. 371 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్ మెంట్ లో చంద్రబాబు ను అరెస్ట్ చేసినట్లు సిఐడి చెపుతోంది. ఇందులో చంద్రబాబుదే ప్రధాన పాత్ర అని ఆరోపిస్తోంది. ఈ స్కాం లో హవాలా రూపంలో పెద్ద ఎత్తున నిధులు చేతులు మారినట్లు ఆరోపిస్తోంది. చంరబాబు అరెస్ట్ పై టీడీపీ శ్రేణులు మండి పడుతున్నాయి. రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేసినట్లు ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.

Next Story
Share it