Telugu Gateway

ఎన్ఆర్ఐ ఫ్యామిలీ అనుమానాస్పద మృతి

ఎన్ఆర్ఐ ఫ్యామిలీ అనుమానాస్పద మృతి
X

విశాఖపట్నంలో కలకలం. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి అనుమానాస్పదంగా మారింది. మధురవాడలోని మిథిలాపురి కాలనీలో ఉన్న ఆదిత్య టవర్స్ ఫ్లాట్ నెంబర్ 505 అపార్ట్‌ మెంట్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఫ్లాట్ లో మంటలు వచ్చాయని వీరు సజీవదహనం అయినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలోనే ఓ ఎన్ఆర్ఐ కుటుంబం అంతా అసువులు బాసినట్లు చెబుతున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతులను సుంకర బంగారు నాయుడు..( 50 ) డాక్టర్ నిర్మల ( 44 ) దీపక్ ( 22 ) కశ్యప్ ( 19 )లుగా గుర్తించారు. అయితే సంఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. హత్యచేసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Next Story
Share it