Telugu Gateway
Andhra Pradesh

ఒక్క రోజు బడ్జెట్..ఓ రికార్డు

ఒక్క రోజు బడ్జెట్..ఓ రికార్డు
X

ఏపీ బడ్జెట్ 2.29 లక్షల కోట్లు

ఏపీ సర్కారు ఓ కొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్క రోజులో బడ్జెట్ ప్రవేశపెట్టడం...అది ఆమోదం పొందటం చకచకా జరిగిపోయాయి. అంతే కాదు..అసెంబ్లీ సమావేశాలు కూడా నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఒకప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అంటే సెలవులతో కలుపుకుని 40 నుంచి 45 రోజులు జరిగేవి. అందులో నికరంగా 29 నుంచి 30 రోజుల పాటు సమావేశాలు సాగేవి. ప్రతి శాఖ పద్దుపైనా విస్తృతంగా చర్చ జరిగేది. కానీ క్రమ క్రమంగా ఈ సమావేశాల రోజులు కరోనాతో సంబంధం లేకుండా తగ్గుతూ వస్తున్నాయి. ఏపీ, తెలంగాణల్లో సేమ్ సీన్ రిపిట్ అవుతోంది. అయితే ఈ సారి ఏపీ బడ్జెట్ సమావేశాలు మాత్రం మరీ ప్రత్యేకం. ఇలా ఒక్క రోజులో బడ్జెట్ పెట్టి..ఆమోదింప చేసుకోవటం ఓ రికార్డు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా రాజ్ భవన్ నుంచే ఉభయ సభలనుద్దేశించి వర్చువల్ పద్దతిలో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు బడ్జెట్‌లో వెచ్చించారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టున్నారు.

Next Story
Share it