Telugu Gateway
Andhra Pradesh

అమరావతి పై అనుచిత వ్యాఖ్యలు

అమరావతి పై అనుచిత వ్యాఖ్యలు
X

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ లు సోమవారం నాడు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఏపీలో నమోదు అయిన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం సాక్షి టీవీలో జరిగిన చర్చ లో కృష్ణం రాజు అనే జర్నలిస్ట్ అమరావతి వేశ్యల రాజధాని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటిని అడ్డుకోకపోగా కొమ్మినేని శ్రీనివాస రావు ఇలా అంటే టీడీపీ వాళ్ళు మిమ్మల్ని సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తారు జాగ్రత్త అంటూ కామెంట్ చేయటం తీవ్ర విమర్శల పాలు అయింది. వాస్తవానికి సెక్స్ వర్కర్స్ విషయంలో మీడియా లో వచ్చిన వార్త వేరు.. కృష్ణంరాజు దానికి అమరావతి కి లింక్ పెట్టి మాట్లాడం తో ఇది ఉద్దేశపూర్వకంగా చేశారు అనే విమర్శలు వెల్లువెత్తాయి.

వైసీపీ, జగన్ మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం కావటంతో ఇది పెద్ద దుమారం రేపింది. కృష్ణంరాజు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అమరావతి మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో పాటు అటు కృష్ణంరాజు తో పాటు కొమ్మినేని శ్రీనివాస రావు లపై కేసులు పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇదే విషయంపై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో పాటు తాజాగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కూడా ఫిర్యాదు చేశారు. కొమ్మినేని శ్రీనివాస రావు అరెస్ట్ తో అమరావతి అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు అరెస్ట్ కూడా ఖాయం అని అధికార వర్గాలు చెపుతున్నాయి. మహిళలపై అనుచిత వ్యాఖల చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజు లపై 79, 196(1), 353(2), 299, 356(2), 61(1)BNS, 67 ITA-2008, 3(1)(U), SC, ST POA Act సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.

Next Story
Share it