Telugu Gateway
Andhra Pradesh

విజయవాడ ఎంపీ బరిలో సీనియర్ ఐఏఎస్ అధికారి?!

విజయవాడ ఎంపీ బరిలో సీనియర్ ఐఏఎస్ అధికారి?!
X

గత ఎన్నికల్లో అధికార వైసీపీ ఏపీలో 22 లోకసభ సీట్లను గెలుచుకున్నా విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఎంపీ సీట్లను మాత్రం దక్కించుకోలేక పోయింది. ఈ మూడు టీడీపీ గెలిచింది. ఈ సారి వాటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది వైసీపీ . అందులో భాగంగానే ఈ సారి అధికార వైసీపీ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ను విజయవాడ లోకసభ బరిలోకి దింపనున్నట్లు ప్రచారం జరుగుతోంది ఆ పార్టీ వర్గాల్లో. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ పోటీ చేసి పరాజయం పాలు అయ్యారు. మధ్యలో ప్రముఖ హీరో నాగార్జున వైసీపీ తరుపున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల అయన ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఎన్నికల ముందు ప్రతి సారి తన పేరు ఇలా ప్రచారంలోకి తెస్తున్నారని తనకు అసలు అలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆ ఐఏఎస్ కి సీట్ ఖరారు చేశారు అని ఆ పార్టీ కి చెందిన కీలక నేత ఒకరు తెలిపారు. ఈ పార్లమెంట్ పరిధి లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వ్యవహారాలు చూసుకోవటానికి అయన కూడా సిద్ధంగా ఉన్నట్లు చెపుతున్నారు.

గతంలో పలు కీలక శాఖల్లో పని చేసిన అయన భారీగానే ఆస్తులు కూడా బెట్టారని..అదే సమయంలో వైజాగ్ లో ఐతే ఆయనకు పెద్ద ఎత్తున భూములు కూడా ఉన్నాయని చెపుతున్నారు. ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఆయనకు పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంకు ఉందని అటు అధికార వర్గాల తో పాటు రాజకీయ వర్గాల్లోనూ ప్రచారం ఉంది. వైసీపీ కి సన్నిహితంగా ఉంటూ వస్తున్న అయన అదే పార్టీ నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు అని చెపుతున్నారు. ఒక వైపు రాజధాని అమరావతి రగడ జరుగుతున్న తరుణములో అయన పొలిటికల్ ఎంట్రీ ఎంత మేర ఫలితాన్ని ఇస్తుంది అన్నది ఆసక్తి కరంగా మారింది. ఐఏఎస్ లుగా పని చేసిన వారు రాజకీయాల్లోకి రావటం ఇదేమి కొత్త కాదు. వచ్చే ఎన్నికల్లో చాలా మంది రాజకీయ కార్యక్షేత్రంలోను తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

Next Story
Share it