ఎస్ఈసీ ఆదేశాలను కొట్టేసిన హైకోర్టు
BY Admin3 March 2021 11:40 AM IST

X
Admin3 March 2021 11:40 AM IST
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొన్ని చోట్ల రీనామినేషన్లకు అనుమతిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేవేసింది. కలెక్టర్ల నివేదిక ఆధారంగా ఆయన ఈ రీనామినేషన్లకు అనుమతించారు. తిరుపతి, పుంగనూరు, రాయచోటి, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో ఈ అనుమతులు ఇచ్చారు.
దీంతోపాటు వార్డు వాలంటీర్ల ట్యాబ్ లను స్వాధీనం చేసుకోవాలన్న ఎస్ఈసీ ఆదేశాలను హైకోర్టు పక్కన పెట్టింది. ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించగా..విచారణ జరిపిన కోర్టు బుధవారం నాడు తీర్పు వెలువరించింది. మార్చి10న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Next Story