ఎస్ఈసీ కార్యదర్శి వాణీమోహన్ తొలగింపు
BY Admin12 Jan 2021 11:30 AM

X
Admin12 Jan 2021 11:30 AM
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన వివాదస్పద నిర్ణయాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం నాడు ఆయన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో భేటీ అయి వచ్చిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తాజాగా ఎస్ఈసీలో సెక్రటరీగా ఉన్న వాణీ మోహన్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. వాణీమోహన్ సేవలు ఎన్నికల కమిషన్‌లో అవసరం లేదని లేఖలో తెలిపారు.
వాణీమోహన్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్పైవ సోమవారం క్రమశిక్షణ చర్యలు చర్యలు తీసుకున్నారు. 30 రోజులపాటు సెలవుపై వెళ్లిన సాయిప్రసాద్.. ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
Next Story