Telugu Gateway
Andhra Pradesh

కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఎస్ఈసీ లేఖ

కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఎస్ఈసీ లేఖ
X

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయినా ఏపీ సర్కారు ఎన్నికల నిర్వహణకు సహకరిస్తుందా?. అధికారులు దారిలోకి వస్తారా?. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు దీనిపై సందేహాలు ఉన్నాయా?. పరిణామాలు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది.తాజాగా కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు చెప్పిందని, అయితే కొన్ని ఉద్యోగ సంఘాలు సహకరించబోమని ప్రకటిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని లేఖలో కోరారు.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఉద్యోగ సంఘాల స్వరం మారింది. సుప్రీంకోర్టు తీర్పు పట్ల మిశ్రమంగా స్పందించాయి. తాము ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఎప్పుడూ చెప్పలేదని, ఆరోగ్యం సరిగాలేని ఉద్యోగులను మినహాయించి.. మిగిలిన వారితో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సచివాలయఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే అత్యంత కీలకంగా మారింది.

Next Story
Share it