వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి ఎస్ఈసీ ఫిర్యాదు
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయటంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసే వరకూ ఎన్నికల విధుల్లో పాల్గొనబోరని..ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదన్నారు. అదే సమమయంలో ప్రాణాపాయం వస్తే ఎదుటివారి ప్రాణాలు తీసేహక్కు రాజ్యాంగం ఇచ్చిందని వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎస్ఈసీ రమేష్ కుమార్ కూడా వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని డీజీపి గౌతం సవాంగ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ఏపీ ఉద్యోగాల సంఘాల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.చంపుతానని వెంకట్రామిరెడ్డి బెదిరించారని తెలిపారు.