Telugu Gateway
Andhra Pradesh

ఏపీ సీఎస్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన స‌మీర్ శ‌ర్మ‌

ఏపీ సీఎస్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన స‌మీర్ శ‌ర్మ‌
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శిగా స‌మీర్ శ‌ర్మ గురువారం సాయంత్రం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. సీఎస్ ఆదిత్య‌నాధ్ దాస్ నుంచి ఆయ‌న నూత‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తొమ్మిది నెలలపాటు ఆదిత్యనాథ్‌ దాస్ ఏపీ సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమీర్ శర్మ మీడియాతో మాట్లాడారు. ''నవరత్నాల అమలు కోసం కృషి చేస్తా. సీఎస్‌గా నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జనగ్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. అందరి సహకారంతో పని చేస్తాను'' అని తెలిపారు. స‌మీర్ శ‌ర్మ‌కు ఇంకా రెండు నెల‌ల సర్వీసు మాత్ర‌మే ఉంది.

అయితే ఆయ‌న‌కు ఆరు నెల‌ల పాటు ఎక్స్ టెన్ష‌న్ ఇప్పించే అవ‌కాశం ఉంద‌ని అధికార వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అంత‌కు ముందు ఆదిత్య‌నాధ్ దాస్ మాట్లాడుతూ ఉమ్మ‌డి రాష్ట్రంలో సాగునీటి శాఖ‌తోపాటు సీఎస్ గా ప‌నిచేసిన కాలంలో త‌న అనుభ‌వాలను గుర్తుచేసుకున్నారు. ప్ర‌తి రోజూ తానే ఆ రోజే కొత్త‌గా విధుల్లో చేరిన‌ట్లు భావిస్తూ ప‌నిచేసిన‌ట్లు తెలిపారు. ఆదిత్య‌నాధ్ దాస్ ఇక నుంచి డిల్లీలో ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఆయ‌న‌కు కేబినెట్ హోదా కూడా క‌ల్పించారు. కేంద్ర‌-రాష్ట్ర సంబంధాల‌కు సంబంధించిన అంశాల‌ను ఆయ‌న చూస్తారు.

Next Story
Share it