Telugu Gateway
Andhra Pradesh

జగన్ లాగే చంద్రబాబు కూడా

జగన్ లాగే  చంద్రబాబు కూడా
X

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి వ్యూహకర్తలు అవసరమా!. అప్పట్లో జగన్ ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా పెట్టుకున్నారు అంటే అప్పటికి అయనకు ఏ మాత్రం పరిపాలన అనుభవం లేదు..రాజకీయ అనుభవం కూడా తక్కువే చంద్రబాబు తో పోలిస్తే. కానీ చంద్రబాబు పరిస్థితి ఆలా కాదు కదా. ఒకప్పుడు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రపంచానికి వ్యూహాలు చెప్పారనే ప్రచారం సాగేది మీడియా లో. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలవటం కోసం ఒక వ్యూహకర్తను పెట్టుకున్నారు..అయన తొలిసారి పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. నిజానికి రాబిన్ శర్మ అనే వ్యక్తి ఎప్పటినుంచో టీపీడీ కోసం పని చేస్తున్నారు. కాకపోతే అయన ఇప్పుడు నేరుగా పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు. ఇదే పత్రికల్లో వచ్చింది. శనివారంనాడు అమరావతి లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో ఇదేమి ఖర్మ పేరుతో ఒక వీడియో విడుదల చేసి..ఈ పేరుతో ఒక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఇదేమీ ఖర్మ టైటిల్ పై సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన పాత్రుడు చంద్రబాబు సమక్షంలోనే ఇది బాగా లేదని..పేరు మార్పు అంశం చూడాలన్నారు.

చంద్రబాబు వెంటనే రాష్ట్రానికి ఇదేమి ఖర్మ అందాం..ఇంకా మంచి పేర్లు ఇవ్వమని కోరారు. అంటే ఈ వ్యూహకర్తలు చేస్తున్న పనులు పార్టీ నాయకులకు కూడా ఏ మాత్రం నచ్చటం లేదు అనే చర్చ నడుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సమావేశంలోనే అయ్యన్న పాత్రుడు ప్రజలు టీడీపీ ని గెలిపించాలని ఫిక్స్ అయ్యారు..మీరు ముందే టిక్కెట్లు ఖరారు చేయండి...నేను ఓడిపోతాను అని నివేదిక ఉంటే నన్ను కూడా పక్కన పెట్టండి..ఇక జాప్యం చేయవద్దు అని చంద్రబాబు ను కోరారు. తర్జన భర్జనలు వద్దు అని సూచించారు. గతంలో వైసీపీ అధినేత జగన్ కూడా పార్టీ మీటింగ్ లో ఐ ప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ను అందరికి పరిచయం చేశారు. గతంలో మోడీ గెలుపుతో పాటు ఎంతో మంది గెలుపుకు పనిచేశారని ..ఇప్పుడు వైసీపీ కి పని చేస్తున్నారని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో చంద్రబాబు కూడా రాబిన్ శర్మను తెర మీదకు తీసుకొచ్చారు. రాబిన్ శర్మ మరి టీడీపీ గెలుపులో ఎంత ప్రభావం చూపిస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it