Telugu Gateway
Andhra Pradesh

ప‌వ‌న్ ను ప‌రిశ్ర‌మే గుదిబండ‌గా భావిస్తోంది

ప‌వ‌న్ ను ప‌రిశ్ర‌మే గుదిబండ‌గా భావిస్తోంది
X

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. ఆయ‌న సినిమా, రాజ‌కీయాలు అనే రెండు ప‌డ‌వ‌ల‌పై కాళ్ళు పెట్టార‌న్నారు. ప‌వ‌న్ లాంటి వారితో ఇబ్బంది ప‌డతామ‌ని ప‌రిశ్ర‌మ‌లోని వారే భావిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ అధికారంలోకి వ‌చ్చే ఛాన్సేలేద‌ని..ప్ర‌భుత్వం మ‌ట‌న్ షాపులు పెడుతుంద‌న‌టం కూడా సరికాదన్నారు. ఏపీలో సినీ ప‌రిశ్ర‌మ‌కు మంచి చేయాల‌నే ప్ర‌భుత్వం చూస్తుంది త‌ప్ప‌..త‌మ‌కు ఎలాంటి ఉద్దేశాలు లేవ‌న్నారు. ప్ర‌భుత్వంపై బుర‌దజ‌ల్లాల‌ని చూస్తే ప‌వ‌న్ కే ఇబ్బంద‌న్నారు. ప్రభుత్వం ఒక మంచి విధానం తెస్తుంటే పవన్‌కల్యాణ్‌ తన స్వార్థం కోసం మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. బాహుబలి విషయంలో సగం డబ్బు ప్రభుత్వానికి, డిస్ట్రిబ్యూటర్‌కి రాలేదని విన్నాను. ఇదే నిజం అయితే ఇంత కంటే దారుణం మ‌రొక‌టి ఉండ‌ద‌న్నారు. ఆన్‌లైన్‌ విధానం ద్వారా అప్పటికప్పుడే ఎవరికెళ్లాల్సిన డబ్బు వారికెళ్తుంది. రామారావు నుంచి కాంతారావు వరకు సినిమా ఎవరిదైనా టికెట్‌ ఒకేలా ఉంటుంది. అందరితో చర్చింఏ ఆన్‌లైన్‌ టికెట్‌ విధానంపై ముందుకెళ్తాం. ప్రజలంతా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. థియేటర్లు ఎవరిచేతుల్లో నడుస్తున్నాయి?. ఎక్కడ ఇబ్బంది అవుతుందో ఇండస్ట్రీ వాళ్లు చెప్పాలి. సీఎం ఇండస్ట్రీ వాళ్లతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలని ముందు నుంచి చెప్తున్నారు. కొద్దిమంది చేతిలో ఉన్న వ్యవస్థను సరళీకృతం చేస్తాం. సినిమా పెద్దలు ఎప్పుడైనా సీఎంను కలవొచ్చ‌న్నారు.

Next Story
Share it