Telugu Gateway
Andhra Pradesh

అడ‌క్కుండానే సీఎం అన్నీ ఇచ్చారు

అడ‌క్కుండానే సీఎం అన్నీ ఇచ్చారు
X

ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీతో ఉద్యోగ సంఘాల నేతలు మంగ‌ళ‌వారం నాడు స‌మావేశం అయ్యారు. మ‌రోద‌ఫా చ‌ర్చ‌లు ఈ నెల 27న జ‌ర‌పాల‌ని త‌ల‌పెట్టారు. మంత్రుల కమిటీ ఉద్యోగుల కోసం ఎదురుచూసిందన్నారు సజ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి. ఉద్యోగ సంఘాల నేతలు ఆలస్యంగా వచ్చినా వేచి చూశామని ఆయన పేర్కొన్నారు. జీవోలు నిలుపుదల చేయాలని ఉద్యోగసంఘాలు కోరాయని ఆయన తెలిపారు. జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదీ అడక్కుండానే సీఎం అన్నీ ఇచ్చారని స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. తెలిపారు. ఇంతకాలం చేసిన ప్రక్రియను తిరగతోడడం సరికాదనే ప్రభుత్వం అప్పీల్ చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఏవైనా మార్పుల గురించి మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సజ్జల తెలిపారు. జీతాలు తగ్గాయన్న అపోహలను మంత్రుల కమిటీ తొలగించే యత్నం చేసింద‌న్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే. జీవోలను అబియన్స్‌లో పెట్టాలని వారు కోరారు. అవి తర్వాతైనా సవరించుకోవచ్చని చెప్పాం. మేం చెప్పిన విషయాలను వాళ్ల నాయకత్వంతో చర్చించి చెప్తామన్నారు. ఫిట్‌మెంట్‌కు సంబంధించి ఎలాంటి మార్పు ఉండదు. ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. వారి అపోహలను తొలగించే యత్నం చేసింది. సీఎం జగన్‌ ఎప్పుడూ ఉద్యోగులకు మేలు చేస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లు ఉద్యోగులు అడగకుండానే అన్నీ చేశాం' అని సజ్జల తెలిపారు.

Next Story
Share it