Telugu Gateway
Andhra Pradesh

జ‌గ‌న్ పై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు అర్ధ‌ర‌హితం

జ‌గ‌న్ పై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు అర్ధ‌ర‌హితం
X

చంద్రబాబు గ‌తంలోనే తెలంగాణ అక్ర‌మ ప్రాజెక్ట్‌లపై మాట్లాడి ఉంటే ఈ రోజు సమస్య వచ్చేది కాదని ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. నాడు పారిపోయిన చంద్రబాబు ఇప్పుడు సీఎంని విమర్శించడం అర్ధరహితమిని, కృష్ణా జలాల గురించి మాట్లాడే అర్హత చంద్ర‌బాబుకు లేదన్నారు. తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లపై కేంద్రం, కేఆర్‌ఎంబీ వద్ద త‌మ వాదనలు వినిపిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కేఆర్‌ఎంబీ మీటింగ్‌ వదిలి కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తే ఏమవుతుంది? అని సజ్జల ప్రశ్నించారు. కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినా... న్యాయం త‌మ వైపే ఉందని అన్నారు. కేఆర్‌ఎంబీ మీటింగ్‌కు వచ్చి తెలంగాణ తమ వాదన వినిపిస్తే బాగుంటుందని అన్నారు.

సమస్య ఇక్కడే పరిష్కారం అయ్యేది.. ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముంది? అని ప్ర‌శ్నించారు. న్యాయబద్ధ హక్కు కోసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని సజ్జల తెలిపారు. కేఆర్‌ఎంబీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని విమర్షించారు. తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లు కేఆర్‌ఎంబీకి కనిపించడం లేదా? అని నిలదీశారు. విద్యుత్‌ పేరుతో అక్రమంగా నీటిని వృథా చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ సగం వాటా అడగడం అసంబద్ధం అని ఆయన విమర్శించారు. విభజన జరిగినప్పుడే ఎవరి వాటా ఏంటనేది నిర్ణయించారని సజ్జల గుర్తు చేశారు.

Next Story
Share it